సాక్షి, ముంబై: సాఫ్ట్ వేర్ సేవల సంస్థ జోహో కార్పొరేషన్ టెకీలకు గుడ్ న్యూస్ చెప్పింది. తమ కార్య కలాపాలను విస్తరించుకునే ప్రణాళికలో భాగంగా త్వరలో 2వేల మంది ఉద్యోగులను ఎంపిక చేయనున్నట్టు వెల్లడించింది. ఇంజనీరింగ్, డిజైన్, కంటెంట్ సేల్స్‌లో విభాగంలో ఈ నియామకాలు ఉంటాయని కంపెనీ ప్రకటించింది.
అనేక దిగ్గజ టెక్ సంస్థలు సహా, అనేక స్టార్టప్‌లు సిబ్బందిని తొలగిస్తున్న తరుణంలో, సాఫ్ట్‌వేర్-యాజ్-ఎ-సర్వీస్ (SaaS) స్టార్టప్ జోహా భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ నియామకాలపై దృష్టిపెట్టింది. ఇంజనీరింగ్, వెబ్ డెవలపర్లు, డిజైనర్లు, ఉత్పత్తి విక్రయదారులు, రైటర్లు, సపోర్ట్ ఇంజనీర్ విభాగం కనీసం 2,000 మంది ఉద్యోగులను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు అకౌంటింగ్, పేరోల్ హెడ్ ప్రశాంత్ గంటి నేషనల్ మీడియాకు వెల్లడించారు. కంపెనీ ఇప్పటికే స్థానికంగా నియామకాలను ప్రారంభించామని, స్కూల్స్ ఆఫ్ లెర్నింగ్ వంటి అప్‌స్కిల్లింగ్ ప్రోగ్రామ్‌లను ప్రారంభించాలని యోచిస్తున్నట్టు తెలిపారు
కాగా ప్రపంచవ్యాప్తంగాసుమారు 10వేల 800 ఉద్యోగులతో, జోహో ఇండియా, అమెరికాలో విస్తృత సేవలు అందిస్తోంది. ఇటీవల ఈజిప్ట్, జెడ్డా, సౌత్ ఆఫ్రికా, కేప్ టౌన్ లాంటి ప్రాంతాలకు విస్తరించింది. ఈ నేపథ్యంలోనే గ్రామీణ భారతదేశంలోని టాలెంట్‌ను అందిపుచ్చుకోవాలని చూస్తోందట.
Comments
Please login to add a commentAdd a comment