దర్భాంగా జిల్లాలో ఇద్దరు ఇంజనీర్లను దారుణంగా హత్యచేసిన ఘటన మరువక ముందే సోమవారం రాత్రి మరో ఘటన చోటు చేసుకుంది. వైశాలి జిల్లాలో ఇంజనీర్ అంకిత్ ఝా అనుమానాస్పద స్థితిలో శవమై తేలాడు.
కలవరపరుస్తున్నవరుస ఇంజనీర్ల హత్యలు
Published Tue, Dec 29 2015 12:16 PM | Last Updated on Sun, Sep 3 2017 2:46 PM
పట్నా: బిహార్ లో వరుసగా ఇంజనీర్లు హత్యకు గురి కావడం కలకలం రేపింది. ఇటీవల దర్భాంగా జిల్లాలో ఇద్దరు ఇంజనీర్లను దారుణంగా హత్యచేసిన ఘటన మరువక ముందే సోమవారం రాత్రి మరో ఘటన చోటు చేసుకుంది. వైశాలి జిల్లాలో ఇంజనీర్ అంకిత్ ఝా అనుమానాస్పద స్థితిలో శవమై తేలాడు.
అంకిత్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, దుండగులు గొంతుకోసి హత్య చేశారని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. అతని హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నామని కేసు దర్యాప్తు కొనసాగుతోందన్నారు.
కాగా డిసెంబర్ 26, ఒక ప్రైవేట్ రహదారి నిర్మాణ సంస్థలో పనిచేసే ఇద్దరు ఇంజనీర్లను గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. దోపిడీదారులే ఈ హత్యలకు పాల్పడి ఉండారనే అనుమానాలువ్యక్తమయ్యాయి. ఈ కేసులో అనుమానితవ్యక్తులుగా ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇది విచారణలో ఉండగానే తాజా హత్య పోలీసులకు సవాల్ గా మారింది.
Advertisement
Advertisement