ఏడుగురు భారతీయ ఇంజనీర్ల కిడ్నాప్‌ | Seven Indian Engineers Kidnapped In Baghlan | Sakshi
Sakshi News home page

ఏడుగురు భారతీయ ఇంజనీర్ల కిడ్నాప్‌

Published Sun, May 6 2018 6:29 PM | Last Updated on Sun, May 6 2018 8:31 PM

Seven Indian Engineers Kidnapped In Baghlan - Sakshi

కాబూల్‌: అప్ఘనిస్తాన్‌లో ఏడుగురు భారతీయ ఇంజనీర్లను గుర్తుతెలియని సాయుధులు కిడ్నాప్‌ చేశారు. ఒక అప్ఘన్‌ ఉద్యోగిని కూడా దుండగులు అపహరించారు. వీరంతా అప్ఘనిస్తాన్‌లోని కేఈసీ కంపెనీకి చెందిన ఉద్యోగులని తెలుస్తోంది. కంపెనీ పనిపై వీరంతా ఓ బస్సులో వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేసినట్లు సమాచారం. ​కాగా, కిడ్నాప్ సమాచారంపై కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని న్యూఢిల్లీలోని విదేశాంగ మంత్రిత్వ శాఖ సంప్రదిస్తోంది.

భారత ఇంజినీర్లను విడిపించేందుకు చర్యలు ప్రారంభించినట్లు భారత రాయబార కార్యాలయ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఘటనకు పాల్పడింది తామేనంటూ ఇంతవరకూ ఏ సంస్థ ప్రకటించుకోలేదని చెప్పారు. కిడ్నాప్‌కు గురైన వారు ఎక్కడివారనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉందనన్నారు. మరోవైపు తాలిబన్‌ ఉగ్రవాద సంస్థ  ఈ కిడ్నాప్‌కు పాల్పడినట్టుగా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement