Baghlan province
-
ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ వరదలు.. 16 మంది మృతి
ఆఫ్ఘనిస్తాన్లోని బగ్లాన్, బదక్షన్ రాష్ట్రాలను భారీ వరదలు ముంచెత్తాయి. తాజాగా సంభవించిన ఈ వరదల కారణంగా 16 మంది మృత్యువాత పడ్డారు. దాదాపు 500 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ రాష్ట్రాల్లోని దండ్ ఎ ఘోరీ, దోషి, పుల్ ఎ ఖుమ్రీ, సెంట్రల్ బదక్షన్‌లోని మోర్చక్ తదితర ప్రాంతాలు వరదలకు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.గత వారంలో ఆఫ్ఘనిస్తాన్లోని పలు ప్రాంతాల్లో సంభవించిన వరదల్లో 300 మంది ప్రాణాలు కోల్పోయారు. వరదల కారణంగా వందలాది ఇళ్లు, వేల ఎకరాల్లోని వ్యవసాయ భూములు ధ్వంసమయ్యాయి. ఈ నేపధ్యంలో ఐక్యరాజ్య సమితి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం(యూఎన్డబ్ల్యుఎఫ్పీ) ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టింది.యూఎన్డబ్ల్యుఎఫ్పీ ట్విట్టర్లో ఒక ఫోటోను షేర్ చేస్తూ, తమ సంస్థ ఉద్యోగులు బగ్లాన్కు అత్యవసర సామగ్రిని పంపిణీ చేస్తున్నారని పేర్కొంది. బగ్లాన్ పోలీస్ కమాండ్ అధిపతి అబ్దుల్ గఫూర్ ఖాడెం మాట్లాడుతూ బగ్లాన్ రాష్ట్రంలోని దోషి జిల్లాలోని లర్ఖబ్ ప్రాంతంలో వర్షాల కారణంగా అత్యధిక నష్టం నమోదైందని చెప్పారు. లర్ఖబ్‌లో ముగ్గురు చిన్నారులు, ఒక మహిళ, ఇద్దరు పురుషులు మరణించారు. 500లకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ వరదల్లో ఒక కుటుంబానికి చెందిన పది మంది సభ్యులు, మరో వ్యక్తి గాయపడ్డారని బదక్షన్ ప్రకృతి విపత్తు నిర్వహణ అధిపతి మహ్మద్ కమ్గర్ తెలిపారు. -
జానపద గాయకుడిని కాల్చి చంపిన తాలిబన్లు
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు నిరంకుశ పాలన సాగిస్తారనే అనుమానాలు బలపడు తున్నాయి. జానపద గాయకుడు ఫవాద్ అందారబీని తాలిబన్లు కాల్చి చంపినట్లు సమాచారం. బఘ్లాన్ ప్రావిన్స్‌లోని అందారబీ వ్యాలీలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. గతంలో కూడా ఒకసారి తాలిబన్లు తమ నివాసానికి వచ్చి, తన తండ్రితో మాట్లాడి టీ తాగి వెళ్లారని ఫవాద్ కుమారుడు జవాద్ అసోసియేటెడ్ ప్రెస్‌కు తెలిపారు. కానీ, శుక్రవారం తాలిబన్ ముఠాకు చెందిన ఒక వ్యక్తి తుపాకీతో తన తండ్రిని కాల్చి చంపేశాడ న్నారు. దోషిని శిక్షిస్తామని స్థానిక తాలిబన్ నేతలు హామీ ఇచ్చారన్నారు. ‘మా నాన్న అమాయకుడు. ప్రజలకు వినోదం పంచడం మాత్రమే తెలిసిన గాయకుడు’అని ఆయన తెలిపారు. తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ స్పందిస్తూ.. ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని తెలిపారు. గాయకుడు అందారబీ ఘిచాక్ అనే వాద్య పరికరాన్ని వాయిస్తారు. తన జన్మభూమి, తన ప్రాంత ప్రజలు, తన దేశం గురించి సంపద్రాయ, దేశభక్తిని ప్రబోధించే పాటలు పాడుతుంటారు. కళాకారుల హక్కులను గౌరవించేలా అంతర్జాతీయ సమాజం తాలిబన్లపై ఒత్తిడి తేవాలని ఐరాస సాంస్కృతిక విభాగం ప్రతినిధి కరీమా బెన్నౌన్ అన్నారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సెక్రటరీ జనరల్ ఆగ్నెస్ కల్లామర్డ్ స్పందిస్తూ... తాలిబన్ల వైఖరి మార లేదనడానికి ఈ ఘటనే నిదర్శనమన్నారు. -
అప్ఘనిస్తాన్‌లో ఏడుగురు భారతీయలు కిడ్నాప్
-
ఏడుగురు భారతీయ ఇంజనీర్ల కిడ్నాప్
కాబూల్: అప్ఘనిస్తాన్‌లో ఏడుగురు భారతీయ ఇంజనీర్లను గుర్తుతెలియని సాయుధులు కిడ్నాప్ చేశారు. ఒక అప్ఘన్ ఉద్యోగిని కూడా దుండగులు అపహరించారు. వీరంతా అప్ఘనిస్తాన్‌లోని కేఈసీ కంపెనీకి చెందిన ఉద్యోగులని తెలుస్తోంది. కంపెనీ పనిపై వీరంతా ఓ బస్సులో వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లు సమాచారం. కాగా, కిడ్నాప్ సమాచారంపై కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని న్యూఢిల్లీలోని విదేశాంగ మంత్రిత్వ శాఖ సంప్రదిస్తోంది. భారత ఇంజినీర్లను విడిపించేందుకు చర్యలు ప్రారంభించినట్లు భారత రాయబార కార్యాలయ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఘటనకు పాల్పడింది తామేనంటూ ఇంతవరకూ ఏ సంస్థ ప్రకటించుకోలేదని చెప్పారు. కిడ్నాప్‌కు గురైన వారు ఎక్కడివారనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉందనన్నారు. మరోవైపు తాలిబన్ ఉగ్రవాద సంస్థ ఈ కిడ్నాప్‌కు పాల్పడినట్టుగా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
వరద బీభత్సం: వందమందిపైగా మృతి
ఉత్తర ఆఫ్ఘానిస్థాన్ ప్రాంతంలో భారీ వర్షాలు, వరదలు కారణంగా దాదాపు వందమందికిపైగా మరణించారని ఆ దేశ ఉన్నతాధికారులు శనివారం వెల్లడించారు. మరో వందమందికిపైగా గాయపడ్డారని తెలిపారు. గత రాత్రి బగ్లన్ ప్రావెన్స్లో గజార్గ్-ఈ- నూర్ జిల్లాలో భయంకరమైన ఈదురుగాలులతోపాటు ఎడతేరపి లేకుండా భారీ వర్షం కురిసిందని చెప్పారు. జిల్లాలో వర్షాలు, వరదలకు రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. రహదారులు దెబ్బతినడంతో క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించేందుకు కష్టతరమైందని చెప్పారు. ఈ నేపథ్యంలో హెలికాప్టర్ల ద్వారా క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించినట్లు చెప్పారు. జిల్లాలో సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపారు.