ఉత్తర ఆఫ్ఘానిస్థాన్ ప్రాంతంలో భారీ వర్షాలు, వరదలు కారణంగా దాదాపు వందమందికిపైగా మరణించారని ఆ దేశ ఉన్నతాధికారులు శనివారం వెల్లడించారు. మరో వందమందికిపైగా గాయపడ్డారని తెలిపారు. గత రాత్రి బగ్లన్ ప్రావెన్స్లో గజార్గ్-ఈ- నూర్ జిల్లాలో భయంకరమైన ఈదురుగాలులతోపాటు ఎడతేరపి లేకుండా భారీ వర్షం కురిసిందని చెప్పారు.
జిల్లాలో వర్షాలు, వరదలకు రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. రహదారులు దెబ్బతినడంతో క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించేందుకు కష్టతరమైందని చెప్పారు. ఈ నేపథ్యంలో హెలికాప్టర్ల ద్వారా క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించినట్లు చెప్పారు. జిల్లాలో సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపారు.