విద్యుత్ ఇంజినీర్ల ధర్నా
Published Tue, Feb 14 2017 12:46 AM | Last Updated on Tue, Sep 5 2017 3:37 AM
– రెగ్యులర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్
కర్నూలు(రాజ్‌విహార్): డిప్యూటేషన్ పద్ధతిన సబ్‌స్టేషన్‌లో పోస్టులు భర్తీచేయడడాన్ని నిర్వసిస్తూ పవర్ ప్లాంగ్ వద్ద సోమవారం విద్యుత్ శాఖ ఇంజినీర్లు ధర్నా నిర్వహించారు. సోలార్ పవర్ ప్లాంట్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభిస్తే ఆందోళన తప్పదని విద్యుత్ శాఖ ఇంజనీర్లు, ఉద్యోగ సంఘాల జేఏసీ ఛైర్మన్ ఎం. ఉమాపతి హెచ్చరించారు. ఓర్వకల్లు, గడివేముల మండలాలలోని నిర్మిస్తున్న సోలార్ పవర్ ప్లాంట్ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను చార్జ్ చేసేందుకు హైదరాబాదు నుంచి వచ్చిన 400కేవీ చీఫ్ ఇంజనీర్ ఆదామ్‌ను అడ్డుకున్నారు. అక్కడ విధుల్లో ఉన్న డీఈలు, ఏడీఈలను బయటకు పంపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న 1000 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి సామార్థ్యం కలిగిన అల్ట్రా సోలార్ పవర్ ప్లాంట్‌లో పని చేసేందుకు రెగ్యూలర్ పోస్టులు భర్తీ చేయాలన్నారు. అప్పటి వరకు వీటిని చార్జ్ (ప్రారంభించకుండా) చేయకుండా నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
డిప్యూటేషన్ పద్ధతిలో ఉద్యోగులను నియమిస్తే ఇప్పటికే పనిచేసే ప్రాంతాల్లో పనిభారం పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 400 కేవీ, 220కేవీ సబ్‌స్టేషన్లలో రెగ్యులర్ ఏడీఈలు, ఇతర విభాగాల ఉద్యోగులను నియమించాలని కోరారు. కొత్త అధికారులు వచ్చే వరకు ఉపకేంద్రాల ప్రారంభాన్ని నిలిపివేయాలని, లేనిపక్షంలో ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ట్రాన్స్‌కో ఏడీఈ ఉపేంద్రం శ్రీనివాసులు, ఇంజనీరింగ్ సంఘం ప్రతినిధులు ఇంజనీర్ల సంఘం జిల్లా ప్రతినిధి రవికుమార్, రాజులయ్య, గంగన్న, ఏడీఈలు నవీన్‌బాబు, శ్రీరాముడు, ఏఈలు ఓనేశీము, కోటి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement