ఏఈఈల పరీక్ష ప్రశాంతం
ఏఈఈల పరీక్ష ప్రశాంతం
Published Sun, Nov 6 2016 9:51 PM | Last Updated on Mon, Sep 4 2017 7:23 PM
కర్నూలు సిటీ: రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 748 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులకు ఆదివారం ఏపీపీఎస్సీ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించింది. జిల్లాలో ఈ పరీక్ష రాసేందుకు 4251 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 3114 మంది పరీక్షకు హాజరయ్యారు. జిల్లాలో మొత్తం 9 కేంద్రాలను ఎంపిక చేశారు. కర్నూలు నగరంలో 8, ఆదోని ఒక కేంద్ర. నగరంలో ఎంపిక చేసిన పరీక్ష కేంద్రాలలో రెండు కేంద్రాల అడ్రసులు తెలియక పోవడంతో కొంత మంది అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు. పోలీసు అధికారుల సహకారంతో సకాలంలో ఆయా కేంద్రాలకు చేరుకున్నారు. బీ క్యాంపులోని భాష్యం స్కూల్‌లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో ఇద్దరు అభ్యర్థులకు ప్రింటింగ్‌లో జరిగిన పోరపాటుతో ఒకే హాల్‌టికెట్ నంబరు వచ్చింది. దీంతో దానిపై ఫొటో ఉన్న అభ్యర్థి మాత్రమే పరీక్ష రాయాలని ఎగ్జామినర్ మరో అభ్యర్థి కొద్దిసేపు అందోళనకు గురి అయ్యాడు. కొందరు సూచనతో తర్వాత నెట్ సెంటర్‌కు వెళ్లి హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోగా అందులో సంబంధిత అభ్యర్థి ఫొటో వచ్చింది. వెంటనే పరిగెత్తుకుంటూ కేంద్రానికి చేరుకుని పరీక్ష రాశాడు.
Advertisement
Advertisement