విజయవాడ: నాగా తీవ్రవాదుల చెరలో ఉన్న కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు ఇంజ నీర్లు ఎట్టకేలకు విడుదలయ్యారు. దీంతో ఐదు రోజులుగా ఆందోళన చెందుతు న్న రెండు కుటుంబాలు...ఊపిరి పీల్చుకున్నాయి. జూలై 27న విజయవాడ కరెన్సీనగర్‌కు చెందిన గోగినేని ప్రతీష్‌చంద్ర, నూజివీడు మండలం గొల్లపల్లికి చెం దిన చింతకింద రాఘవేంద్రరావు(రఘు)లను నాగా రివల్యూషనరీ ఫ్రంట్ (ఎన్‌ఆర్‌ఎఫ్) తీవ్రవాదులు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. చర్చల్లో భాగంగా ముందస్తు ఒప్పందంలోని కొంత నగదును బుధవారం తీవ్రవాద సంస్థకు చెల్లిం చిన పృథ్వీ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ ప్రతినిధులు..మిగిలిన మొత్తం గురువారం ఉద యం చెల్లించడంతో కిడ్నాప్ చేసిన ఇంజనీర్లను విడుదల చేశారు. ఈ విషయాన్ని సదరు ఇంజనీర్లు కుటుంబ సభ్యులకు తెలిపారు. వారు విడుదలైన తర్వాత దిమ్మాపూర్ నుంచి అస్సాం రాజధాని గువాహటికి గురువారం సాయంత్రం చేరుకుని, అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్‌కు గురువారం రాత్రి చేరుకుంటారు. శుక్రవారం విజయవాడకు వస్తారని కుటుంబ సభ్యులు తెలిపారు.