- 96 మందిని బదిలీ చేస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: ఏపీలోని వివిధ జోన్లలో ఎంపికై ప్రస్తుతం తెలంగాణ నీటి పారుదల శాఖలో పని చేస్తున్న 96 మంది ఇంజనీర్లను వెనక్కి పంపిస్తూ తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వు లు జారీ చేసింది.
ఇందులో 10 మంది ఎస్‌ఈలు, 11 మంది ఈఈలు, 20 మంది డీఈలు, 55 మంది ఏఈఈలు ఉన్నారు. తెలంగాణలోని 5, 6 జోన్లలో ఎంపికై ఆంధ్రాలో పనిచేస్తున్న ఇంజ నీర్లను ఏపీ ప్రభుత్వం ఇటీవల తెలంగాణకు పంపించిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ సైతం ఏపీ అధికారులను వెనక్కి పం పిస్తూ ఉత్తర్వులిచ్చింది.
ఏపీ ప్రభుత్వం వెనక్కి పంపిన అధికారుల్లో తెలంగాణతోపాటు ఆంధ్రాకు చెందిన ఇంజనీర్లు కూడా ఉండగా తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇక్కడి స్థానికత కలిగిన ఉద్యోగులను కాకుండా కేవలం ఏపీ వారినే వెనక్కి పంపింది. ముందు నుంచీ చెబుతున్నట్లుగా తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగులకు ఇక్కడే పోస్టింగ్‌లు కల్పించేందుకు సిద్ధమైంది.