మౌలిక వసతుల కల్పనలో ఇంజనీర్ల పాత్ర కీలకం
కలెక్టర్ శ్రీకాంత్
నెల్లూరు (హరనాథపురం) : మౌలిక వసతుల కల్పనలో ఇంజనీర్ల పాత్ర కీలకమని కలెక్టర్ ఎన్.శ్రీకాంత్ అన్నారు. స్థానిక సోమశిల ప్రాజెక్ట్ సర్కిల్ కార్యాలయంలో ఏపీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్
కలెక్టర్ శ్రీకాంత్
నెల్లూరు (హరనాథపురం) : మౌలిక వసతుల కల్పనలో ఇంజనీర్ల పాత్ర కీలకమని కలెక్టర్ ఎన్.శ్రీకాంత్ అన్నారు. స్థానిక సోమశిల ప్రాజెక్ట్ సర్కిల్ కార్యాలయంలో ఏపీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య 154 జయంతిని పురస్కరించుకుని సోమవారం ‘ఇంజనీర్స్ డే’ నిర్వహించా రు. కలెక్టర్ మాట్లాడుతూ సామాన్య ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, మంచి నీరు తదితర ప్రాజెక్టుల రూపకల్పనలో ఇంజనీర్లు సరైన ప్లానింగ్‌తో పని చేసినప్పుడే సాధ్యమవుతుందన్నారు. ప్రాజెక్ట్‌లు దీర్ఘకాలం మన్నికగా ఉండేలా ప్లాన్ ఉండాలన్నారు. మోక్షగుండ విశ్వేశ్వరయ్య, కేఎల్‌రావు, శ్రీధరన్ వంటి ఇంజ నీర్లు మంచి ప్రాజెక్ట్‌ల రూపకల్పనలో కీలకపాత్ర పోషించారన్నారు. మోక్షగుండం జయంతిని భారత ప్రభుత్వం ఇంజనీరింగ్ డేగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఇప్పటికే జిల్లాలో ఎక్కువ నీరు సముద్రంలో కలుస్తుందని, ఆ నీటిని మనం వినియోగించుకునేలా ఇంజనీర్లు డిజైన్లను తయారు చేయాలని సూచించారు. తొలుత మోక్షగుండ విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేక్‌ను కట్ చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రక్తదానం కార్యక్రమా న్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ట్రైనీ జేసీ ఇంతియాజ్, రిటైర్డ్ సీఈ ప్రభాకర్, ఇరిగేషన్, తెలుగుగంగ, సోమశిల ప్రాజెక్టుల ఎస్‌ఈలు కోటేశ్వరరావు, సుబ్బారావు, సాబ్‌జాన్, అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కాకి విజయబాబు, వేణుగోపాల్, ప్రియదర్శిని పాల్గొన్నారు.