మిషన్ కాకతీయలో చేపట్టిన చెరువుల పునరుద్ధరణలో భాగంగా చిన్న నీటిపారుదల శాఖలో ఇంజినీర్లకు జియో ట్యాంగింగ్‌పై శిక్షణ ఇస్తున్నారు. మిషన్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున చెరువుల పునరుద్ధరణ చేపట్టినందున వాటి పూర్వపరాలు ఆన్‌లైన్‌లో ఉంచేందుకు ఈ జియో ట్యాగింగ్ వ్యవస్థ ఉపకరిస్తుంది.
నేడు ఇరిగేషన్ ఇంజినీర్లకు జియో ట్యాగింగ్‌పై శిక్షణ..!
Published Thu, Aug 4 2016 1:03 AM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM
వరంగల్ : మిషన్ కాకతీయలో చేపట్టిన చెరువుల పునరుద్ధరణలో భాగంగా చిన్న నీటిపారుదల శాఖలో ఇంజినీర్లకు జియో ట్యాంగింగ్‌పై శిక్షణ ఇస్తున్నారు. మిషన్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున చెరువుల పునరుద్ధరణ చేపట్టినందున వాటి పూర్వపరాలు ఆన్‌లైన్‌లో ఉంచేందుకు ఈ జియో ట్యాగింగ్ వ్యవస్థ ఉపకరిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ వ్యవస్థపై ఇంజినీర్లకు ఒక రోజు శిక్షణ ఇస్తున్నారు. ఈ మేరకు గురువారం ఐఐటీకి చెందిన నిపుణులు జిల్లాకు వస్తున్నట్లు సమాచారం. శిక్షణ కార్యక్రమం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో చేసే అవకాశాలున్నాయి.
Advertisement
Advertisement