వీబీఆర్‌ను నిపుణుల కమిటీ బృందం శుక్రవారం సందర్శించింది. వీబీఆర్ కట్ట పటిష్టత హెడ్‌రెగ్యులేటర్, స్పిల్వే, వన్‌ఆర్‌తూము, ఇన్‌ఫాల్ రెగ్యులేటర్ల పనితీరును పరిశీలించి గంగ అధికారులకు పలు సలహాలు ఇచ్చారు.
వీబీఆర్‌ను సందర్శించిన నిపుణుల కమిటీ
Published Fri, Nov 4 2016 11:57 PM | Last Updated on Mon, Sep 4 2017 7:11 PM
వెలుగోడు: వీబీఆర్‌ను నిపుణుల కమిటీ బృందం శుక్రవారం సందర్శించింది. వీబీఆర్ కట్ట పటిష్టత హెడ్‌రెగ్యులేటర్, స్పిల్వే, వన్‌ఆర్‌తూము, ఇన్‌ఫాల్ రెగ్యులేటర్ల పనితీరును పరిశీలించి గంగ అధికారులకు పలు సలహాలు ఇచ్చారు. వీబీఆర్ కట్ట పటిష్టంగా ఉందని ధ్రువీకరించారు. రెగ్యులేటర్ల నిర్వహణ, మరమ్మతులపై పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. జిల్లాలో రిజర్వాయర్ల పరిశీలన కోసం ప్రస్తుతం రిటైర్డు ఇంజనీర్లతో బృందం ఏర్పాట్లు చేసినట్లు రిటైర్డు డీఈ అబ్దుల్ బషీర్ అహమ్మద్ తెలిపారు. ఇందులో భాగంగా శుక్రవారం పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్, బానకచర్ల క్రాస్ రెగ్యులేటర్, వీబీఆర్‌లను సందర్శించినట్లు తెలిపారు. సందర్శించిన నిపుణుల కమిటీలో రిటైర్డు సీఈ సత్యనారాయణ, రిటైర్డు డీఈ కృష్ణారావు, స్థానిక గంగ ఈఈ పుల్లారావు, డీఈలు రఘురామిరెడ్డి, దామోదర్, ఏఈ ఇలియాస్ తదితరులు ఉన్నారు.
Advertisement
Advertisement