ఘనంగా ఇంజనీర్స్‌డే వేడుకలు | Grandly Engineers day | Sakshi
Sakshi News home page

ఘనంగా ఇంజనీర్స్‌డే వేడుకలు

Published Thu, Sep 15 2016 5:28 PM | Last Updated on Mon, Sep 4 2017 1:37 PM

ఘనంగా ఇంజనీర్స్‌డే వేడుకలు

ఘనంగా ఇంజనీర్స్‌డే వేడుకలు

అనంతగిరి(కోదాడఅర్బన్‌): మండల పరిధిలోని అనంతగిరిలోని అనురాగ్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో గురువారం మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఇంజనీర్స్‌డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎంవీ శివప్రసాద్‌ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకుని ఇంజనీరింగ్‌ విద్యార్థులు దేశాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్ధులకు క్విజ్, పోస్టర్‌ ప్రెజెంటేషన్, డిబేట్, పేపర్‌ ప్రెజెంటేషన్, మాక్‌ ఇంటర్వూలు నిర్వహించి విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలు విభాగాల హెచ్‌ఓడీలు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement