Grandly
-
ఘనంగా సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు
-
విజయనగరంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
-
పెదఅమిరంలో ఘనంగా అంతర్జాతీయ తెలుగు సంబరాలు
-
అమ్మవార్లకు వైభవంగా గ్రామోత్సవం
తాడేపల్లిగూడెం రూరల్ : గ్రామదేవతలు శనివారం సాయంత్రం ఆలయాలకు చేరుకున్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పది రోజులుగా అమ్మవారి ప్రతిరూపమైన గరగలను మాధవరం, అప్పారావుపేట, జగన్నాథపురం, దండగర్ర, ఎల్.అగ్రహారం గ్రామాల్లో ఊరేగించారు. శనివారం అమావాస్య కావడంతో అమ్మవార్లు ఆలయాలకు చేరుకున్నారు. ఉగాది పర్వదినమైన ఆదివారం అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆలయాల వద్ద ఉత్సవ కమిటీలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. శనివారం స్థానిక 6, 11 వార్డుల మధ్య వేంచేసియున్న దానేశ్వరి అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు. 4వ వార్డు జీఎస్ఆర్ హైస్కూలు సమీపంలోని పుంతలో ముసలమ్మవారి ఊరేగింపు శనివారం రాత్రి వైభవంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంలో అమ్మవారిని ఆదివారం ఊరేగించనున్నారు. కనకవయ్యారమ్మ, వీర -
ఘనంగా సామూహిక వివాహాలు
బజార్హత్నూర్(బోథ్): మండలంలోని భూతాయి(బి) గ్రామపంచాయతీ పరిధి వంజర్‌భూతాయిలో సోమవారం గ్రామాభివృద్ధి కమిటీ, హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో ఎనిమిది జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు. గ్రామ పెద్ద పాటిల్ పడ్ మాట్లాడుతూ గ్రామంలో 1992 నుంచి సామూహిక వివాహాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామంలో పేద, వ్యవసాయ కుటుంబాలకు చెందిన వారేనని, ఒక వివాహం చేయాలంటే రూ.లక్షల్లో ఖర్చవుతుందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామస్తులంతా ఒక నిర్ణయానికి వచ్చి సామూహిక వివాహాలు జరిపించాలని నిర్ణయించామని, 25 సంవత్సరాలుగా నిరంతరంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. ఒక సంవత్సరంలో గ్రామంలో ఎన్ని సంబంధాలు కుదిరినా వాటన్నింటికీ ఒక తేదీ నిర్ణయించి సామూహిక వివాహాలు జరిపిస్తామని, మహా అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఒక్కో జంటకు రూ.20వేల నుంచి రూ.30 వేలు తీసుకుని మొత్తం రూ.2లక్షలతో టెంట్లు, భోజన ఏర్పాట్లు, బ్యాండుమేళాలు, పెండ్లికి పూలదండలు, బ్రహ్మణుల ఖర్చులు అన్నింటినీ అందులో నుంచే ఖర్చు చేస్తామని తెలిపారు. ఒక్కో జంటకు రూ.30 వేలతో వివాహం చేసే వెసులుబాటు ఉంటుందని, ఆ కుటుంబంపై ఆర్థిక భారం పడకుండా గ్రామస్తులందరూ సహకారం అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో దినేశ్ ముండే, హరిచంద్ ముండే, ప్రహ్లాద్ పడ్, వినాయక్ ముండే, ప్రభాకర్ ముండే హనుమాన్ యూత్ సభ్యులు ఈశ్వర్, సంతోష్ పడ్, మారుతీ, నాగనాథ్, శివరాజ్, మాధవ్ పాల్గొన్నారు. పెళ్లికి హాజరైన బంధువులు, గ్రామస్తులు -
కదిరిలో ఘనంగా లక్ష్మీ నారసింహడి రథోత్సవం
-
ఆదిలాబాద్‌లో నాగోబా జాతర సందడి
-
ఘనంగా ఎన్టీఆర్ లలిత కళా పురస్కారాలు
-
ప్రకాశం జిల్లాలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
-
తెలుగు లోగిళ్లలో ఘనంగా దీపావళి సంబరాలు
-
ఘనంగా ’కర్వా చౌత్’ ఫెస్టివల్
-
ఒంగోలులో ఘనంగా దుర్గాష్టమి వేడుకలు
-
అమ్మవారికి కుంకుమార్చన
-
ఘనంగా బొడ్డెమ్మ పండగ
నల్లగొండ కల్చరల్ : తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో బొడ్డెమ్మ పండగను ఘనంగా నిర్వహించారు. చిన్నారులు బొడ్డెమ్మలను తీసుకువచ్చి ఒక్క దగ్గర చేర్చి చుట్టూ చేరి పాటలు పాడుతూ అలరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి సభ్యులు క్రాంతి, అరుణశ్రీ, సింగం లక్ష్మి, కౌన్సిలర్ మారగోని నవీన్‌కుమార్‌గౌడ్, ఎడ్ల గీత, జాగృతి జిల్లా అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, రాష్ట్ర నాయకులు వేణు సంకోజు, కవిత, పద్మ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా సీఎస్ఐ ఆవిర్భావ దినోత్సవం
కోదాడఅర్బన్: కోదాడ పట్టణంలోని గాంధీనగర్‌లోని సీఎస్ఐ ప్రొస్టేట్ చర్చిలో ఆదివారం సీఎస్ఐ సంఘం 70వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ఐ సంఘం వ్యవస్థాపకుడు బిషప్ అజరయ్య చిత్రపటానికి ప్రొస్టేట్ చైర్మన్ పి.అశోక్సాల్మన్తో పాటు పలువురు క్రైస్తవులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిషప్ అజరయ్య సంఘ వ్యవస్థాపనకు చేసిన కృషి, సంఘానికి చేసిన సేవ, ఆయన గొప్పతనాన్ని వివరించారు. అనంతరం సంఘం జెండాను ఆవిష్కరించి 70సంవత్సరాల పైబడిన వృద్ధులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రొస్టేట్ సెక్రెటరీ అన్నెపంగు సంగీతరావు, కోశాధికారి ప్రభుదాస్, డయోసిస్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు కర్ల జాన్‌డేవిడ్, సభ్యులు రాజు, కాంతయ్య, యాకోబురాజు, కమలాకరుణాకర్, పద్మ , పలువురు క్రైస్తవులు పాల్గొన్నారు. -
ఘనంగా ఇంజనీర్స్‌డే వేడుకలు
అనంతగిరి(కోదాడఅర్బన్): మండల పరిధిలోని అనంతగిరిలోని అనురాగ్ ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఇంజనీర్స్‌డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవీ శివప్రసాద్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకుని ఇంజనీరింగ్ విద్యార్థులు దేశాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్ధులకు క్విజ్, పోస్టర్ ప్రెజెంటేషన్, డిబేట్, పేపర్ ప్రెజెంటేషన్, మాక్ ఇంటర్వూలు నిర్వహించి విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలు విభాగాల హెచ్ఓడీలు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఘనంగా పవన్‌కల్యాణ్ జన్మదిన వేడుకలు
కొండమల్లేపల్లి సినీ నటుడు పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు శుక్రవారం పవన్ కల్యాణ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని సోలిడార్ తెలంగాణ బదిరుల పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో కేక్ కట్ చేసి విద్యార్థులకు పండ్లు, మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి, రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో అసోసియేషన్ పట్టణ అధ్యక్షుడు జువ్వ సురేష్‌కుమార్, గుండాల వెంకటమ్మయాదయ్య, ఉపసర్పంచ్ కుంభం శ్రీను, ట్రస్ట్ డైరెక్టర్ దార్ల భాస్కర్ ఉన్నారు. -
ఘనంగా మదర్ థెరిస్సా జన్మదిన వేడుకలు
కోదాడఅర్బన్: దేశంలో అనాథలకు, అభ్యాగులకు సేవలందించి విశ్వమాతగా పేరుపొందిన మదర్ థెరిస్సా జన్మదిన వేడుకలను శుక్రవారం కోదాడ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్ కార్యాలయ సమీపంలోని ఆమె విగ్రహానికి పలువురు కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పట్టణంలోని తేజ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పలువురు విద్యార్థులు మదర్ థెరిస్సా వేషధారణలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణ పరిధిలోని మానసిక వికలాంగుల కేంద్రంలోని విద్యార్థులకోసం పాఠశాల 10వ తరగతి విద్యార్థులు పండ్లు, బియ్యాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మట్లాడుతూ మదర్ థెరిస్సా చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు కత్రం నాగేందర్‌రెడ్డి, సయ్యద్ ముస్తఫా, సంజీవ్‌రెడ్డి, రవి, తేజ పాఠశాల డైరక్టర్ జానకిరామయ్య, ప్రధానోపాధ్యాయుడు అప్పారావు, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు
-
పుష్కరం పరిపూర్ణం
-
‘అక్షర’లో ఘనంగా ఫ్రెషర్స్‌డే
చిలుకూరు: మండల పరిధిలోని అక్షరా పాలిటెక్నిక్ , వైష్ణవి డీఎడ్ కళాశాలలో బుధవారం ఘనంగా ప్రెషర్స్‌డే కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన డ్యాన్స్‌లు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో చైర్మన్ కైలాసపు రామానాథం, వైస్ చైర్మన్ గంగిరెడ్డి కృష్ణారెడ్డి, సెక్రెటరీ బండి అనిల్‌కుమార్‌రెడ్డి, కరస్పాండెంట్ బూర లక్ష్మీనారాయణ, ప్రిన్సిపాళ్లు గంగిరెడ్డి రమేష్‌రెడ్డి, గంగిరెడ్డి వీరారెడ్డి, డైరక్టర్ డాక్టర్ గౌస్‌పాషా, పర్యావరణ ఉద్యమకారుడు కొల్లు లక్ష్మీనారాయణ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో తేళ్లపంచమి
-
ఘనంగా బోనాల పండుగ
కోదాడరూరల్): మండల పరిధిలోని బొజ్జగూడెంతండాలో శ్రావణమాసం మొదటి ఆదివారం గ్రామా దేవతైన ‘ముత్యాలమ్మ’ తల్లి కి బోనాల సమర్పించారు. మహిళలు గ్రామ శివారులో ఉన్న గుడి వద్దకు బోనాలతో వచ్చి తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుగులోతు పంతులు, సుశీల, గుగులోతు శ్రీను, నాగేశ్వరావు, లచ్య, మహిళలు పాల్గొన్నారు. -
కనువిందుగా విశాఖ ఉత్సవ సంబరాలు
-
ఘనంగా ముగిసిన దేవీ నిమజ్జనోత్సవం
-
ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు
-
నిను మరువము రాజన్నా..
సాక్షి, కాకినాడ :తమ గుండెగుడిలో కొలువైన వైఎస్సార్‌కు జిల్లావాసులు ఘనంగా నివాళులర్పించారు. దశాబ్దాలు గడిచినా ఆ మహనీయుడిని మరువబోమని నిరూపించారు. ఊరూవాడా ‘వైఎస్సార్ జోహార్’ అంటూ నినదించాయి. పట్టణాలు, పల్లెలనే తేడా లేకుండా జిల్లావ్యాప్తంగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఐదో వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులతో పాటు సామాన్య ప్రజలు సైతం పార్టీ లు, మతాలకతీతంగా మంగళవారం పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించి, తమ అభిమాన నేతకు ఘనంగా నివాళులర్పించారు. శాసన సభలో పార్టీ ఉపనేత జ్యోతుల నెహ్రూతో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, చిర్ల జగ్గిరెడ్డి, దాడిశెట్టి రాజా, వంతల రాజేశ్వరి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుతో పాటు పలువురు ముఖ్య నేతలు హైదరాబాద్ పంజగుట్ట సెంటర్లోని మహానేత విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే జిల్లావ్యాప్తంగా పార్టీ నేతలు సేవా కార్యక్రమాలతో వైఎస్‌కు నివాళులర్పించారు. కాకినాడ గొడారిగుంటలోని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ కాకినాడ సిటీ కో-ఆర్డినేటర్ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి.. వైఎస్ చిత్ర పటానికి పూలమాల వేసి, ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మహర్షి సాంబమూర్తి వికలాంగ పాఠశాల విద్యార్థులకు పండ్లు, రొట్టెలు, బిస్కెట్లు పంపిణీ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా ప్రచార కన్వీనర్ రావూరి వెంకటేశ్వరరావు, నగర అధ్యక్షుడు ఆర్‌వీజేఆర్ కుమార్, మాజీ డిప్యూటీ మేయర్ పసుపులేటి వెంకటలక్ష్మి పాల్గొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో జెడ్పీ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇంద్రపాలెంలో నిరుపేదలకు అన్నదానం చేసి, దుస్తులు పంపిణీ చేశారు. కొవ్వాడ, కొవ్వూరు, రాయుడుపాలెంలలో వృద్ధుల ఆశ్రమాల్లో పండ్లు, పాలు పంపిణీ చేసి, ఆర్థికసాయం అందజేశారు. రాజమండ్రి సిటీలోని కోటగుమ్మం, లాలాచెరువు సెంటర్లలోని వైఎస్సార్ విగ్రహాలకు మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, కార్పొరేషన్ వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ షర్మిలా రెడ్డి, డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ గుత్తుల మురళీధర్, ఆదిరెడ్డి వాసు తదితరులు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. రాష్ర్ట కార్యదర్శి జక్కంపూడి రాజా, సేవాదళ్ రాష్ర్ట కార్యదర్శి సుంకర చిన్ని తదితరులు స్వర్ణాంధ్ర వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులతో కలిసి సహఫంక్తి భోజనాలు చేశారు. ప్రభుత్వాస్పత్రిలో రోగులకు రొట్టెలు పంపిణీ చేశారు. అమలాపురం హైస్కూల్ సెంటర్లో పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు కుడుపూడి చిట్టబ్బాయి, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. ఏరియా ఆస్పత్రిలో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, అభిమానులు రక్తదానం చేశారు. అమలాపురం రూరల్ మండలం బండార్లంకలో పేదలకు వస్త్రదానం చేశారు. పి.గన్నవరం నియోజకవర్గ పరిధిలో అంబాజీపేట సెంటర్లో వైఎస్సార్ విగ్రహానికి కుడుపూడి చిట్టబ్బాయి, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, జిల్లా అధికార ప్రతినిధి పి.కె.రావు, కోఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, మిండగుదిటి మోహన్ తదితరులు క్షీరాభిషేకం చేశారు. రాజోలు మాజీ ఎమ్మెల్యే అల్లూరి కృష్ణంరాజు, కోఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావు ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో ఉన్న వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అనపర్తి కో ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో పెదపూడిలో సుమారు 10 వేల మందికి అన్నదానం చేశారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు తదితరుల ఆధ్వర్యంలో కడియం మండలం బుర్రిలంకలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. స్థానిక ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పండ్లు, ఆర్థికసాయం అందజేశారు. పలుకు ఆశ్రమ పాఠశాలలో బధిరులకు పలకలు, పుస్తకాలు, ప్లేట్లు పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో జక్కంపూడి రాజా, సుంక ర చిన్ని తదితరులు పాల్గొన్నారు. కోరుకొండలో పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జెడ్పీ ప్రతిపక్ష నాయకుడు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో జగ్గంపేటలో వైఎస్సార్ వర్ధంతి నిర్వహించారు. జగ్గంపేట సెంటర్లో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి, ఆస్పతిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు.మండపేటలో పార్టీ రైతువిభాగం జిల్లా కన్వీనర్ రెడ్డి రాధాకృష్ణ, పార్టీ నాయకుడు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. పార్టీ వాణిజ్య విభాగం జిల్లా కన్వీనర్ కర్రి పాపారాయుడు ఆధ్వర్యంలో అర్తమూరులో వైఎస్సార్‌కు నివాళులర్పించారు. పెద్దాపురం, సామర్లకోట పట్టణాల్లో పార్టీ కోఆర్డినేటర్ తోట సుబ్బారావునాయుడు ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. సామర్లకోటలోని సిరి మానసిక వికలాంగుల పాఠశాలలో చిన్నారులకు పండ్లు పంపిణీ చేశారు. ముమ్మిడివరంలో పార్టీ కో ఆర్డినేటర్ గుత్తుల సాయి ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. ఆలమూరులో మహిళా విభాగం మాజీ రాష్ర్ట కన్వీనర్ కొల్లి నిర్మలాకుమారి, కొత్తపేటలో జిల్లా అధికార ప్రతినిధి గొల్లపల్లి డేవిడ్‌రాజు ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. జిల్లావ్యాప్తంగా అన్ని పట్టణాలు, మండల కేంద్రాలు, మారుమూల గ్రామాల్లో సైతం వైఎస్సార్ అభిమానులు ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు నివాళులర్పించడంతో పాటు స్థానికంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. -
ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు
సాక్షి, ముంబై: శ్రీ సువర్ణ సంఘం 66వ వార్షికోత్సవంతోపాటు శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం కూడా జరిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శివసేన మాజీ కార్పొరేటర్ జగదీష్ సావంత్, బోగ కృష్ణ పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. విజేతలను ప్రశంసాపత్రం, నగదు బహుమతితో సత్కరించారు. సంఘం ప్రధాన కార్యదర్శి మంచాల శంకర్ మాట్లాడుతూ సంస్థ చేపట్టిన సేవలను కొనియాడారు. ఈ సంఘాన్ని స్థాపించి పురోభివృద్ధికి తోడ్పడిన బింగి విఠల్, గాజంగి బాలయ్య, గుడ్ల ఎర్రన్న, బింగి వెంకట్, లక్కవత్తుల గంగారాంలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. సంఘం అధ్యక్షుడు బింగి సావన్, కోశాధికారి సాముల దత్తాత్రేయ వచ్చిన అతిథులను సత్కరించగా, సాంస్కృతిక శాఖ ప్రముఖులు తోట సుదర్శన్, ఉపాధ్యక్షులు చాట్ల రాజు, ఉపకార్యదర్శి వంగ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.