ఘనంగా సీఎస్‌ఐ ఆవిర్భావ దినోత్సవం | Grandly sucuss CSI estblished day | Sakshi
Sakshi News home page

ఘనంగా సీఎస్‌ఐ ఆవిర్భావ దినోత్సవం

Published Sun, Sep 25 2016 11:29 PM | Last Updated on Mon, Sep 4 2017 2:58 PM

ఘనంగా సీఎస్‌ఐ ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా సీఎస్‌ఐ ఆవిర్భావ దినోత్సవం

కోదాడఅర్బన్‌: కోదాడ పట్టణంలోని గాంధీనగర్‌లోని సీఎస్‌ఐ ప్రొస్టేట్‌ చర్చిలో ఆదివారం  సీఎస్‌ఐ సంఘం 70వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్‌ఐ సంఘం వ్యవస్థాపకుడు బిషప్‌ అజరయ్య చిత్రపటానికి ప్రొస్టేట్‌ చైర్మన్‌ పి.అశోక్‌సాల్మన్‌తో పాటు పలువురు క్రైస్తవులు ఘనంగా నివాళులర్పించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిషప్‌ అజరయ్య సంఘ వ్యవస్థాపనకు చేసిన కృషి, సంఘానికి చేసిన సేవ, ఆయన గొప్పతనాన్ని  వివరించారు. అనంతరం సంఘం జెండాను ఆవిష్కరించి 70సంవత్సరాల పైబడిన వృద్ధులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రొస్టేట్‌ సెక్రెటరీ అన్నెపంగు సంగీతరావు, కోశాధికారి ప్రభుదాస్, డయోసిస్‌ ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడు కర్ల జాన్‌డేవిడ్, సభ్యులు రాజు, కాంతయ్య, యాకోబురాజు, కమలాకరుణాకర్, పద్మ , పలువురు క్రైస్తవులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement