
ప్రత్యేక అలంకరణలో దానేశ్వరి అమ్మవారు
తాడేపల్లిగూడెం రూరల్ : గ్రామదేవతలు శనివారం సాయంత్రం ఆలయాలకు చేరుకున్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పది రోజులుగా అమ్మవారి ప్రతిరూపమైన గరగలను మాధవరం, అప్పారావుపేట, జగన్నాథపురం, దండగర్ర, ఎల్.అగ్రహారం గ్రామాల్లో ఊరేగించారు. శనివారం అమావాస్య కావడంతో అమ్మవార్లు ఆలయాలకు చేరుకున్నారు. ఉగాది పర్వదినమైన ఆదివారం అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
ఆలయాల వద్ద ఉత్సవ కమిటీలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. శనివారం స్థానిక 6, 11 వార్డుల మధ్య వేంచేసియున్న దానేశ్వరి అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు. 4వ వార్డు జీఎస్‌ఆర్ హైస్కూలు సమీపంలోని పుంతలో ముసలమ్మవారి ఊరేగింపు శనివారం రాత్రి వైభవంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంలో అమ్మవారిని ఆదివారం ఊరేగించనున్నారు. కనకవయ్యారమ్మ, వీర