sucuss
-
ఘనంగా సీఎస్ఐ ఆవిర్భావ దినోత్సవం
కోదాడఅర్బన్: కోదాడ పట్టణంలోని గాంధీనగర్‌లోని సీఎస్ఐ ప్రొస్టేట్ చర్చిలో ఆదివారం సీఎస్ఐ సంఘం 70వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ఐ సంఘం వ్యవస్థాపకుడు బిషప్ అజరయ్య చిత్రపటానికి ప్రొస్టేట్ చైర్మన్ పి.అశోక్సాల్మన్తో పాటు పలువురు క్రైస్తవులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిషప్ అజరయ్య సంఘ వ్యవస్థాపనకు చేసిన కృషి, సంఘానికి చేసిన సేవ, ఆయన గొప్పతనాన్ని వివరించారు. అనంతరం సంఘం జెండాను ఆవిష్కరించి 70సంవత్సరాల పైబడిన వృద్ధులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రొస్టేట్ సెక్రెటరీ అన్నెపంగు సంగీతరావు, కోశాధికారి ప్రభుదాస్, డయోసిస్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు కర్ల జాన్‌డేవిడ్, సభ్యులు రాజు, కాంతయ్య, యాకోబురాజు, కమలాకరుణాకర్, పద్మ , పలువురు క్రైస్తవులు పాల్గొన్నారు. -
విద్యార్థుల ప్రతిభ వెనక గురువుల కృషి
–ఎమ్మెల్సీ పూల రవీందర్ కోదాడ: వివిధ రంగాల్లో తెలుగు విద్యార్థులు తమ ప్రతిభ చాటుతున్నారని, వారి ప్రతిభ వెనుక అనేక మంది గురువుల కృషి దాగివుందని ఎమ్మెల్సీ పూల రవీందర్ అన్నారు. శనివారం కోదాడలోని సెయింట్ జోసఫ్ చింతా చంద్రారెడ్డి కాన్వెంట్లో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320ఈ ఆధ్వర్యంలో నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు చెందిన 55 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతి«థిగా హజరయ్యారు. ఆయన మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర ఎంతో విలువైనదని, వెలకట్టలేనిదని ఆయన అన్నారు. అన్ని దేశాల్లో అన్ని వృత్తులకన్నా ఉపాధ్యావృత్తిలో ఉన్న వారికి అధిక గౌరవం లబిస్తుందని, అదే గౌరవం మనం ఇవ్వాలని కోరారు. ఉనాధ్యాయులు కూడ బోధనను ఉద్యోగంగా కాకుండా సామాజిక బాధ్యతగా తీసుకొని మెరుగైన సమాజ ఏర్పాటుకు కృషి చెయాలని కోరారు. స్వచ్చంద సంస్థలు కూడా ఉపాధ్యాయుల కృషిని గుర్తించి ప్రోత్సహించాలని, అలా చేస్తున్న లయన్స్‌క్లబ్ వారిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. లయన్ డిస్ట్రిక్ గవర్నర్ యం. రామానుజచార్యులు మాట్లాడుతూ విద్యారంగానికి తోడ్పాటును, ప్రోత్సహాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ సమావేశంలో డాక్టర్ కాప మురళీ కృష్ణ, ఎం. బాస్కర్‌రెడ్డి, ఎం.వీ గోనారెడ్డి, డాక్టర్ ప్రమీలా శ్రీపతిరెడ్డి, రావెళ్ల సీతరామయ్య, మామళ్ల శ్రీనివాసరెడ్డి, తీగల మోహన్‌రావు, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
డీవైఎఫ్ఐ మహాసభలను విజయవంతం చేయాలి
మునగాల: భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య(డీవైఎఫ్ఐ) తెలంగాణ తొలి రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా కమిటీ సభ్యుడు షేక్ ఖాదర్ కోరారు. ఈ సమావేశాన్ని పట్టణంలో ఆగస్టు తొలి వారంలో నిర్వహిస్తామన్నారు. సోమవారం మండల కేంద్రంలోని అమరవీరుల స్మారక భవనంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యువజనోద్యమాల సారథి, ఐక్యపోరాటాల వారధి డీవైఎఫ్ఐ తొలి రాష్ట్ర మహాసభలకు చారిత్రాత్మక పోరాటాల పురిటిగడ్డ కోదాడ పట్టణం వేదిక కానున్నదని వివరించారు. ఈ తొలి రాష్ట్ర మహాసభల ఏర్పాటుకై బుధవారం కోదాడలో జరిగే సన్నాహాక సమావేశంలో మండలం నుంచి అధిక సంఖ్యలో సభ్యులు పాల్గొని జయప్రదం చేయాలని ఖాదర్ పిలుపునిచ్చారు. -
రైతు సంఘం మహాసభలను విజయవంతం చేయాలి
నడిగూడెం: ఈ నెల 25న మండల కేంద్రంలో నిర్వహించనున్న తెలంగాణా రైతు సంఘం 16వ మహాసభలను విజవంతం చేయాలని సీపీఎం పార్టీ సీనియర్ నాయకుడు బుర్రి శ్రీరామలు కోరారు. శుక్రవారం ఆ మహాసభలకు సంబం«ధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ మహాసభల్లో అధిక సంఖ్యలో రైతులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం డివిజన్ ప్రధాన కార్యదర్శి ఏనుగుల వీరాంజనేయులు, నాయకులు బెల్లంకొండ సత్యనారాయణ, అనంతుల క్రిష్ణయ్య, సీతారాంరెడ్డి, మల్లెల వెంకన్న, బిక్షం, కాసాని కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
కోదాడ: ఎస్సీ వర్గీకరణ వెంటనే చేపట్టాలని, పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టి వెంటనే ఆమోదించాలని కోరుతూ ఈ నెల 19 నుంచి ఆగష్టు 12 వరకు ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద ఎమ్మార్పీస్ నేత మంద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షలలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చెయాలని మాదిగ మహిళ సమాఖ్య జిల్లా అధ్యక్షరాలు మారేపల్లి సావిత్రమ్మ కోరారు. ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెడతామని చెప్పిన బీజేపీ రెండు సంవత్సరాలు పూర్తవుతున్నా నేటికి ఆ విషయాన్ని పట్టించుకోక పోవడం అన్యాయమన్నారు. ఈ నెల 29న మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడతున్నందున కోదాడ నుంచి మహిళలు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. ఈ సమావేశంలో మాతంగి శైలజ, గోళ్ల సుజాత, పిడమర్తి నాగేశ్వరి, బోడ శ్రీరాములు, ఏపూరి రాజు తదితరులు పాల్గొన్నారు.