విద్యార్థుల ప్రతిభ వెనక గురువుల కృషి
–ఎమ్మెల్సీ పూల రవీందర్
కోదాడ: వివిధ రంగాల్లో తెలుగు విద్యార్థులు తమ ప్రతిభ చాటుతున్నారని, వారి ప్రతిభ వెనుక అనేక మంది గురువుల కృషి దాగివుందని ఎమ్మెల్సీ పూల రవీందర్ అన్నారు. శనివారం కోదాడలోని సెయింట్ జోసఫ్ చింతా చంద్రారెడ్డి కాన్వెంట్‌లో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320ఈ ఆధ్వర్యంలో నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు చెందిన 55 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతి«థిగా హజరయ్యారు. ఆయన మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర ఎంతో విలువైనదని, వెలకట్టలేనిదని ఆయన అన్నారు. అన్ని దేశాల్లో అన్ని వృత్తులకన్నా ఉపాధ్యావృత్తిలో ఉన్న వారికి అధిక గౌరవం లబిస్తుందని, అదే గౌరవం మనం ఇవ్వాలని కోరారు. ఉనాధ్యాయులు కూడ బోధనను ఉద్యోగంగా కాకుండా సామాజిక బాధ్యతగా తీసుకొని మెరుగైన సమాజ ఏర్పాటుకు కృషి చెయాలని కోరారు. స్వచ్చంద సంస్థలు కూడా ఉపాధ్యాయుల కృషిని గుర్తించి ప్రోత్సహించాలని, అలా చేస్తున్న లయన్స్‌క్లబ్ వారిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. లయన్ డిస్ట్రిక్ గవర్నర్ యం. రామానుజచార్యులు మాట్లాడుతూ విద్యారంగానికి తోడ్పాటును, ప్రోత్సహాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ సమావేశంలో డాక్టర్ కాప మురళీ కృష్ణ, ఎం. బాస్కర్‌రెడ్డి, ఎం.వీ గోనారెడ్డి, డాక్టర్ ప్రమీలా శ్రీపతిరెడ్డి, రావెళ్ల సీతరామయ్య, మామళ్ల శ్రీనివాసరెడ్డి, తీగల మోహన్‌రావు, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.