CSI
-
ఆరోపణలు తగదు
– బిషప్ పుష్పలలిత నంద్యాలవిద్య : సీఎస్ఐ ట్రస్టు అసోసియేషన్ స్టేక్ హోల్డర్స్ కమిటీ సభ్యులు తనపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని నంద్యాల డయాసిస్ బిషప్ పుష్పలలిత అన్నారు. మంగళవారం చర్చి ఆఫ్ సౌత్ ఇండియా నంద్యాల డయాసిస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. వ్యక్తిగత కారణాలచేత తనపై కక్ష సాధించేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. తన పరిపాలనలో ఎలాంటి అవినీతి, అక్రమాలు జరగలేదని.. ‘పరిశుద్ధ సిలువపై ఒట్టేసి చెబుతున్నా..నేను ఎలాంటి పాపంచేయలేదు’ అంటూ స్పష్టం చేశారు. తనపై ఆరోపణలు చేసున్నవారు గతంలో డయాసిస్ పెద్దలపై దుర్భాషలాడారని, వారిపై క్రమశిక్షణ రాహిత్య చర్యలు తీసుకున్నానేతప్ప ఎటువంటి కక్షసాధింపు చర్యలు చేపట్టలేదని పేర్కొన్నారు. సమావేశంలో వైస్ ప్రసిడెంట్ రెవరెండ్ ఏసురత్నం, సెక్రటరీ గంగు ఆనంద్, కోశాధికారి రత్నరాజు, గురువులు పాల్గొన్నారు. -
ఘనంగా సీఎస్ఐ ఆవిర్భావ దినోత్సవం
కోదాడఅర్బన్: కోదాడ పట్టణంలోని గాంధీనగర్‌లోని సీఎస్ఐ ప్రొస్టేట్ చర్చిలో ఆదివారం సీఎస్ఐ సంఘం 70వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ఐ సంఘం వ్యవస్థాపకుడు బిషప్ అజరయ్య చిత్రపటానికి ప్రొస్టేట్ చైర్మన్ పి.అశోక్సాల్మన్తో పాటు పలువురు క్రైస్తవులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిషప్ అజరయ్య సంఘ వ్యవస్థాపనకు చేసిన కృషి, సంఘానికి చేసిన సేవ, ఆయన గొప్పతనాన్ని వివరించారు. అనంతరం సంఘం జెండాను ఆవిష్కరించి 70సంవత్సరాల పైబడిన వృద్ధులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రొస్టేట్ సెక్రెటరీ అన్నెపంగు సంగీతరావు, కోశాధికారి ప్రభుదాస్, డయోసిస్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు కర్ల జాన్‌డేవిడ్, సభ్యులు రాజు, కాంతయ్య, యాకోబురాజు, కమలాకరుణాకర్, పద్మ , పలువురు క్రైస్తవులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా వైఎస్ఆర్ స్మారక పోటీలు
నిజామాబాద్ స్పోర్ట్స్ : దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని జిల్లా వైఎస్ఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో క్రీడా పోటీలు జరుగుతున్నాయి. శనివారం సీఎస్ఐ మైదానంలో క్రికెట్ పోటీలు ప్రారంభించారు. సెప్టెంబర్ 2న వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఈ పోటీలు నిర్వహిస్తున్న ట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమైన క్రికెట్ పోటీల్లో ఆరు జట్లు పాల్గొన్నాయి. లీగ్‌స్థాయి మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఆదివారం సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. అలాగే వాలీవాల్ పోటీలు డీఎస్ఏ మైదానంలో జరగనున్నాయి. వైఎస్ఆర్ అభిమాన సంఘం ప్రతినిధులు, నిర్వాహకులు జయప్రసాద్, జ్యోతిరాజ్, సుభాష్, శోభన్‌బాబు, బెనర్జీ, చరణ్‌లు పాల్గొన్నారు.