ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు
Published Thu, Aug 29 2013 11:02 PM | Last Updated on Fri, Sep 1 2017 10:14 PM
సాక్షి, ముంబై: శ్రీ సువర్ణ సంఘం 66వ వార్షికోత్సవంతోపాటు శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం కూడా జరిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శివసేన మాజీ కార్పొరేటర్ జగదీష్ సావంత్, బోగ కృష్ణ పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి.
విజేతలను ప్రశంసాపత్రం, నగదు బహుమతితో సత్కరించారు. సంఘం ప్రధాన కార్యదర్శి మంచాల శంకర్ మాట్లాడుతూ సంస్థ చేపట్టిన సేవలను కొనియాడారు. ఈ సంఘాన్ని స్థాపించి పురోభివృద్ధికి తోడ్పడిన బింగి విఠల్, గాజంగి బాలయ్య, గుడ్ల ఎర్రన్న, బింగి వెంకట్, లక్కవత్తుల గంగారాంలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. సంఘం అధ్యక్షుడు బింగి సావన్, కోశాధికారి సాముల దత్తాత్రేయ వచ్చిన అతిథులను సత్కరించగా, సాంస్కృతిక శాఖ ప్రముఖులు తోట సుదర్శన్, ఉపాధ్యక్షులు చాట్ల రాజు, ఉపకార్యదర్శి వంగ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement