ఇంజనీర్లపై నమ్మకం లేకనే సీఎం సొంత సమీక్ష
రాష్ట్రంలోని ప్రాజెక్టులపై ఇంజనీర్లు సరైన వివరాలు చెప్పడం లేదని.. అందువల్లే సీఎం సొంతంగా సమీక్షలు చేస్తూ చర్యలు చేపడుతున్నారని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్‌రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు.
పాములపాడు/జూపాడుబంగ్లా:
రాష్ట్రంలోని ప్రాజెక్టులపై ఇంజనీర్లు సరైన వివరాలు చెప్పడం లేదని.. అందువల్లే సీఎం సొంతంగా సమీక్షలు చేస్తూ చర్యలు చేపడుతున్నారని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్‌రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. గురువారం వీరు మండలంలోని యర్రగూడూరు గ్రామం వద్ద 24 ప్యాకేజీలోని ఎస్‌ఆర్‌ఎంసీ విస్తరణ పనుల్లో భాగంగా నిర్మాణంలోని వంతెనను పరిశీలించారు. జూన్ చివరి నాటికే పనులు పూర్తి కావాల్సి ఉండగా ఇంత వరకు పూర్తి కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బానకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ వద్ద నిర్మాణంలోని గాలేరు నగరి అదనపు గేట్లను పరిశీలించి సంతప్తి వ్యక్తం చేశారు. ఎస్‌ఆర్‌బీసీ వెంట సూపర్‌ప్యాసేజీ స్టీలు బ్రిడ్జీలు కూల్చివేయడంతో కేసీ ఆయకట్టు పొలాలు సాగు నీరు లేక బీళ్లుగా మారే పరిస్థితి ఉందని విలేకరులు ప్రశ్నించగా నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. అంతకు ముందు జూపాడుబంగ్లా మండలంలోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను సందర్శించారు. శ్రీశైలం జలాశయం నీటిని ప్రస్తుతం దిగువ ప్రాంతాలకు తరలించే వెసలుబాటుపై ఎస్‌ఈ రామచంద్రను అడిగి తెలుసుకున్నారు. వీరి వెంట కపడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ఈఈలు గంగయ్య, శ్రీనివాసరెడ్డి, డీఈ శిరాంప్రసాద్ ఉన్నారు.