శాన్‌ఫ్రాన్సిస్కో : సెర్చింజన్ దిగ్గజం గూగుల్‌కు ఇద్దరు ఉద్యోగులు గుడ్‌బైచెప్పడం కలకలం రేపింది. గత నెలలో కృత్రిమ మేథ (ఏఐ)పరిశోధకుడు టిమ్నిట్ గెబ్రూపై గూగుల్ వేటు వేయడాన్ని నిరసిస్తూ ఇద్దరు కీలక టెకీలు సంస్థకు గుడ్‌బై చెప్పారు. వైవిధ్యం,నైతిక విలువలపై కొనసాగుతున్న వివాదాలు తీవ్రస్ధాయి స్ధాయికి చేరిన నేపథ్యంలో ఇంజనీరింగ్ డైరెక్టర్, సాఫ్ట్‌వేర్ డెవలపర్ గూగుల్ నుంచి నిష్క్రమించడం చర్చకు దారితీసింది.యూజర్ భద్రత వ్యవహారాలను పర్యవేక్షించే డేవిడ్ బకర్ 16 ఏళ్ల పాటు సంస్థతో ఉన్న అనుబంధాన్ని తెంచుకుంటున్నానంటూ ప్రటించారు.గెబ్రూ నిష్క్రమణ అనంతరం గూగుల్‌లో కొనసాగదల్చుకోలేదని చెప్పారు.
మరోవైపు సెర్చింజన్ దిగ్గజంలో జరుగుతున్న పరిణామాలకు నిరసనగా మరో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వినీష్ కన్నన్ గూగుల్‌ను వీడుతున్నట్టు బుధవారం ట్వీట్ చేశారు. పేర్కొన్నారు. గెబ్రూ, ఏప్రిల్ క్రిస్టియానాల పట్ల గూగుల్ దురుసుగా ప్రవర్తించిందనీ, వారికి అన్యాయం జరిగిందంటూ కన్నన్ పేర్కొన్నారు. గెబ్రూ, క్రిస్టియానా ఇరువురూ నల్ల జాతీయులు కావడం గమనార్హం.మరోవైపు ఈ పరిణామంపై వ్యాఖ్యానించడానికి గూగుల్ నిరాకరించింది. అయితే గెబ్రూ నిష్క్రమణ తరువాత సంస్థపై ఉద్యోగుల నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment