ముగ్గురు యువకులు మద్యం మత్తులో కారుతో ఢీకొట్టిన ఘటనలో గాయపడిన చిన్నారి సంజన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. హైదరాబాద్‌లోని పెద్దఅంబర్‌పేట వద్ద ఆదివారం రాత్రి ముగ్గురు యువకులు మద్యం మత్తులో నిర్లక్ష్యంగా కారు నడిపి రోడ్డు దాటుతున్న తల్లి శ్రీదేవి, కూతురు సంజనను ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ఎల్‌బీ నగర్‌లోని కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంజన పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు వెల్లడించారు.