ఎక్కడున్నా అది మాత్రం మానను! | Samantha Fitness secret gym! | Sakshi
Sakshi News home page

ఎక్కడున్నా అది మాత్రం మానను!

Jun 14 2016 2:06 AM | Updated on Apr 4 2019 5:41 PM

ఎక్కడున్నా అది మాత్రం మానను! - Sakshi

ఎక్కడున్నా అది మాత్రం మానను!

ఏ సిటీ వెళ్లినా.. ఆ మాటకొస్తే ఏ స్టేట్ వెళ్లినా సమంత అది మాత్రం మానరు. ఏ విషయంలో అయినా రాజీపడతారేమో కానీ...

ఏ సిటీ వెళ్లినా.. ఆ మాటకొస్తే ఏ స్టేట్ వెళ్లినా సమంత అది మాత్రం మానరు. ఏ విషయంలో అయినా రాజీపడతారేమో కానీ, ఆ విషయంలో అస్సలు రాజీపడరు. ఇంతకీ సమంత ఏం మానుకోరు? అని ఊహించడం మొదలుపెట్టేశారా? మరేం లేదు. చెప్పబోతున్న విషయం జిమ్‌కి సంబంధించినది. ఈ మధ్య జిమ్ సెంటర్లో అమాంతంగా వంద కేజీలు బరువు ఎత్తి, సమంత అందర్నీ ఆశ్చర్యపరచిన విషయం తెలిసిందే. ఈవిడగారు మంచి ఫిట్‌నెస్ ఫ్రీక్. ఆ విషయం గురించి సమంత మాట్లాడుతూ -

‘‘ఫిట్‌నెస్ కోసం ఒక్కొక్కరు ఒక్కో విధానాన్ని పాటిస్తారు. కొంతమంది యోగా చేస్తారు. మరికొంతమంది ఏవేవో థెరపీలు చేస్తారు. ఇంకొంత మంది జిమ్ చేస్తారు. నా విషయానికొస్తే నేను జిమ్ చేస్తాను. వారంలో ఐదు రోజులు తప్పనిసరిగా చేయాల్సిందే. హైదరాబాద్‌లో ఉన్నా చెన్నై వెళ్లినా.. ఎక్కడికెళ్లినా జిమ్ మాత్రం మానను’’ అని చెప్పారు. సమంత ఫిట్‌నెస్ సీక్రెట్ అదన్నమాట. మామూలుగా యోగా చేసేటప్పుడు రమ్యకృష్ణ ‘బంచికు బంచికు చెయ్యి బాగా.. ఒంటికి యోగా మంచిదేగా..’ అని పాడారు. అదే సమంత అయితే.. ‘జిమ్.. జిమ్.. రిమ్.. జిమ్..’ అని పాడతారేమో.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement