Pushpa Star Allu Arjun Gym Workout Video Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Allu Arjun Gym Workout Video: పుష్ప-2 కోసం తెగ కష్టపడుతున్న అల్లు అర్జున్‌.. వీడియో వైరల్‌

Published Tue, Apr 18 2023 2:24 PM | Last Updated on Tue, Apr 18 2023 2:44 PM

Allu Arjun Gym Work Out Video Goes Viral  - Sakshi

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'పుష్ప' సినిమాతో పాన్‌ ఇండియా స్థాయిలో ​క్రేజ్‌ సొంతం చేసుకున్న బన్నీ ప్రస్తుతం పుష్ప-2 షూటింగ్‌లో బిజీబిజీగా గడిపేస్తున్నాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్‌ లుక్‌ చాలా 'రా అండ్‌ రగ్గడ్‌'గా ఉంటుంది. దీనికోసం ఆయన కొన్ని నెలల పాటు ప్రత్యేక డైట్‌ను ఫాలో అయ్యారట.

షూటింగ్‌ లేకపోయినా బన్నీ ఫిట్‌నెస్‌కి ఎంతో ప్రాధాన్యత ఇస్తాడు. అందుకే 41 ఏళ్ల వయసులోనూ అంత ఫిట్‌ అండ్‌ స్టైలిష్‌గా ఉంటారు. ఇక టాలీవుడ్‌లో ఫస్ట్‌ సిక్స్‌ ప్యాక్‌ బాడీతో కనిపించిన తొలి హీరోగా బన్నీకి పేరుంది. ఈ క్రమంలో పుష్ప-2లో మరింత రగ్గడ్‌ లుక్‌లో కనిపించేందుకు తెగ కష్టపడుతున్నాడు. జిమ్‌లో చెమటలు చిందిస్తూ వర్కవుట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. మీరూ చూసేయండి మరి.  


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement