12 వారాల్లో 6 ప్యాక్ బాడీ..! | six pack body in 12 weaks? | Sakshi
Sakshi News home page

12 వారాల్లో 6 ప్యాక్ బాడీ..!

Published Wed, Jun 11 2014 12:16 AM | Last Updated on Tue, Nov 6 2018 4:55 PM

12 వారాల్లో 6 ప్యాక్ బాడీ..! - Sakshi

12 వారాల్లో 6 ప్యాక్ బాడీ..!

6 ప్యాక్ బాడీ పెంచాలంటే రోజూ గంటల తరబడి సంవత్సరాల పాటు జిమ్‌కే అంకితం కావాలా? తొడలు వాచిపోయేలా ఎక్సర్‌సైజులు చేయాలా? అని అత డిని అడిగితే... అవేం లేదు, కొంచెం క్రమశిక్షణ ఉంటే చాలు, మూడు నెలల్లోనే సిక్స్‌ప్యాక్ బాడీని సాధించవచ్చు అంటాడు ఒమర్‌షరీఫ్. శరీరాన్ని తీర్చిదిద్దుకోవడానికి కూడా క్రమశిక్షణ తప్పనిసరి అంటున్నాడు. అనడమే కాదు, చేసి చూపించాడు. కచ్చితంగా 12 వారాల్లోనే అంటే మూడంటే మూడు నెలల్లో తన శరీరాకృతిని తీర్చిదిద్దుకొని చూపించాడు.
 
బ్రిటన్‌కు చెందిన ఒమర్‌షరీఫ్‌కు చిన్నప్పటి నుంచి చిన్న పాటి ఎక్సర్‌సైజ్ కూడా చేసిన నేపథ్యం లేదట. పొట్ట పెరిగి ఫ్యామిలీ ప్యాక్ అనిపించుకొంటున్న అతడికి ఉన్నట్టుండి తన శరీరాన్ని సిక్స్‌ప్యాక్‌గా తీర్చిదిద్దుకోవాలనిపించింది. ప్రత్యేకంగా ట్రైనర్ అవసరం లేకుండానే అతి తక్కువ కాలవ్యవధిలోనే అతడు దాన్ని సాధించి చూపించాడు. ప్రధానంగా ఆహారపు అలవాట్లు మార్చుకోవడమే తన శరీరాకృతి మారడానికి కారణమని అంటాడు ఒమర్. చికెన్, మటన్‌కబాబ్‌లు, పిజ్జాలు, చేప కూరలు, చిప్స్ తెగ తినేవాడట. ఈ మెనుతో రోజుకు ఆరు సార్లు భోంచేసేవాడట. ఇక వేపుడు వంటకాలు, చక్కెర ఎక్కువగా ఉండే డ్రింక్స్, కార్బోహైడ్రేట్స్‌ను తగ్గించేశాడు. పండ్లు, కూరగాయలు తరచూ తీసుకొనే వాడట.

తినే మెనూ ఇలా ఉంటే జిమ్‌లో శ్రమ విషయంలో కూడా చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవాడట. రోజుకు నాలుగు గంటల చొప్పున 12 వారాలూ క్రమం తప్పకుండా శ్రమించాడట. ఇంకే ముంది! ఈ విషయంలో ఇతడి క్రమశిక్షణను చూసి శరీరం కూడా సహకరించింది. సిక్స్‌ప్యాక్‌గా మారిపోయింది. ఈ సాధన సమయంలో తన శరీరంలో వచ్చిన మార్పులను ఎప్పటికప్పుడు భార్య చేత ఫొటోలు తీయించుకొంటూ ఉత్సాహాన్ని తెచ్చుకొనే వాడట. ఇప్పడు ఇతడి సిక్స్‌ప్యాక్ బాడీ అలాంటి దేహాన్ని తీర్చిదిద్దుకోవాలనుకొనే వారికి గైడ్ అవుతుందని వేరే చెప్పనక్కర్లేదు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement