బరువు తగ్గడం అనేది చిటికెలోనో, చిట్కాలతోనో జరిగేది కాదు. దీనికోసం సమతుల ఆహారం, నిరంతర వ్యాయామం కావాలి. వీటన్నింటికీ మించి పట్టుదల, చిత్తశుద్ధి, నిరంతర సాధన ఉండాలి. ఈ విషయాన్నే అక్షరాలా నిజం చేసి చూపించింది ఇంగ్లాండ్‌లోని నార్త్ ఆప్టన్‌షైర్‌కు చెందిన 20 ఏళ్ల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ మిల్లీ స్లేటర్. చిన్న జిమ్ చిట్కాతో ఏడాది పాటు శ్రమించి బరువు ఎలా తగ్గిందో తెలుసుకుందాం రండి!
మిల్లీ స్లేటర్ 2023లో 115 కేజీల బరువుండేది. ఎలాగైనా బరువు తగ్గాలని నిర్ణయించుకుంది. జిమ్ చేసి ఒక్క ఏడాదిలో48 కిలోల బరువు తగ్గింది. ఇపుడు టోన్డ్ ఫిజిక్‌తో నాజూగ్గా తయారైంది. ఇపుడు ఆమె బరువు 67 కిలోలు. తన వెయిట్ లాస్ జర్నీని టిక్‌టాక్‌లో(టిక్‌టాక్‌పై ఇండియాలో నిషేధం) పంచుకుంది. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.
న్యూస్‌వీక్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ట్రెడ్‌మిల్‌పై వెయిట్ ట్రైనింగ్, ట్రెడ్‌మిల్ ఇంక్లైన్ వాకింగ్ ద్వారా తన జిమ్ అనుభవాన్ని గణనీయంగా పెంచిందని స్లేటర్ వెల్లడించింది. ఫిట్‌నెస్‌కి పోషకాహారం ఎంత కీలక పాత్ర పోషిస్తుందో వివరించింది. జిమ్‌లో సాధనతోపాటు, తక్కువ కేలరీలు, ఎక్కువ ప్రోటీన్ల ఆహారంపై దృష్టి సారించాలని పేర్కొంది. వ్యాయామం అనేది ఆహ్లాదకరంగా ఉండాలని సూచించింది. 30 నిమిషాల పాటు గంటకు 3 మైళ్ల వేగంతో 12 శాతం గ్రేడ్‌తో ట్రెడ్‌మిల్ వర్కౌట్ చేస్తానని తెలిపింది. ఇది లారెన్ గిరాల్డో చెప్పిన 12-3-30 ట్రెడ్‌మిల్ వర్కౌట్ లా ఉంటుందని స్లేటర్ తెలిపింది.
మరోవైపు బయోమెకానిక్స్ జర్నల్ ఇటీవల ప్రచురించిన అధ్యయనం ప్రకారం చదునైన నేల మీద నడిచిన దానితో పోలిస్తే ట్రెడ్‌మిల్ మీద 5 శాతం ఇంక్లైన్‌లో నడిస్తే 17 శాతం, 10 శాతం ఇంక్లైన్‌లో నడిస్తే 32 శాతం అదనంగా కేలరీలు ఖర్చు అవుతాయట. మరోవైపు 12-3-30 వర్కవుట్‌తో కేవలం 30 నిమిషాల్లో 150 పౌండ్ల బరువున్నవ్యక్తి దాదాపు 300 కేలరీలు ఖర్చు చేయగలడని హెల్త్ సెంట్రల్ చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment