నాయకులవుతారా.. జిమ్కు వెళ్లండి | Tall, muscular men seen as better leaders | Sakshi
Sakshi News home page

నాయకులవుతారా.. జిమ్కు వెళ్లండి

Published Thu, Feb 25 2016 2:48 PM | Last Updated on Sun, Sep 3 2017 6:25 PM

నాయకులవుతారా.. జిమ్కు వెళ్లండి

నాయకులవుతారా.. జిమ్కు వెళ్లండి

న్యూయార్క్: రాజకీయ నాయకులుగా మారి దేశాన్ని పాలించాలని కలలు కంటున్నారా? అయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే జిమ్ల వైపు క్యూ కట్టండి. ఎందుకంటే, ఓ వ్యక్తి మంచి శారీరక దారుఢ్యాన్ని కలిగి ఉండి, మంచి ఎత్తు ఉంటే తప్పకుండా నాయకుడవుతాడని, ప్రజలను ఇట్టే ఆకర్షిస్తాడని ఓ అధ్యయనం వెల్లడిస్తోంది.

తెలివి తేటలు, సుదీర్ఘ దృష్టి అనేవి ప్రతి వ్యక్తికి ఉండే అంతర్గత లక్షణాలని, వాటిని కేవలం అనుభవం ద్వారానే ప్రజలు తెలుసుకోగలుగుతారని, కానీ, శారీరక దారుఢ్యం మాత్రం బయటకు కనిపించేదని, చూడగానే కళ్లను ఇట్టే ఆకర్షించి నాయకుడంటే ఇతడే అనే భావనను వారికి కలిగిస్తుందంటా. 'ఎన్నో ఉదాహరణలతో పొందుపరిచి ఉన్న అంశాలను పరిశీలించిన మాకు ప్రపంచంలో శారీరక సామర్థ్యం ఉన్నవారంతా రాజకీయ నాయకులుగా ఎదిగారని తెలిసింది' అని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కెలీ హాస్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కు చెందిన పరిశోధన కారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement