అతిగా జిమ్ చేస్తూ యువకుడి మృతి | youth loses life while exercising in gym | Sakshi
Sakshi News home page

అతిగా జిమ్ చేస్తూ యువకుడి మృతి

Published Mon, Mar 10 2014 8:25 AM | Last Updated on Wed, Sep 18 2019 3:24 PM

అతిగా జిమ్ చేస్తూ యువకుడి మృతి - Sakshi

అతిగా జిమ్ చేస్తూ యువకుడి మృతి

హైదరాబాద్ ఎల్బీనగర్ ప్రాంతంలో అతి వ్యాయామం ఓ యువకుడి ప్రాణాలను బలి తీసుకుంది. అలకాపురిలో ఉన్న ఓజిల్ సాలిడ్ ఫిట్ నెస్ సెంటర్లో ట్రెడ్మిల్ మీద ఏకంగా రెండు గంటల పాటు వ్యాయామం చేసిన వాసు అనే యువకుడు అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడు. వనస్థలిపురం ప్రాంతానికి చెందిన ఈ యువకుడు ట్రెడ్ మిల్ మీద పరుగులు తీస్తుండగానే అక్కడికక్కడే దానిమీదనే కుప్పకూలిపోయాడు.

అయితే ఆ విషయాన్ని అక్కడివాళ్లు ఎవరూ గమనించలేదు. దాతో వాసు అక్కడికక్కడే మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన జరిగిన వెంటనే జిమ్ యజమాని పరారైనట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement