వెయిట్... 52 వెయిట్ లిఫ్ట్... 72! | Samantha Lifting 72KG Heavy Weights at Gym | Sakshi
Sakshi News home page

వెయిట్... 52 వెయిట్ లిఫ్ట్... 72!

Published Sun, Nov 6 2016 1:01 AM | Last Updated on Mon, Sep 4 2017 7:17 PM

వెయిట్... 52 వెయిట్ లిఫ్ట్... 72!

వెయిట్... 52 వెయిట్ లిఫ్ట్... 72!

 పది.. ముప్ఫై.. యాభై.. కాదండీ! ఏకంగా 72 కిలోల బరువు.. స్వీట్ అండ్ క్యూట్ హీరోయిన్ సమంత కాస్త కష్టపడుతూనే 72 కిలోల వెయిట్‌ను లిఫ్ట్ చేశారు. మరి, ఇంతకీ సమంత వెయిట్ ఎంతో తెలుసా? కొంచెం అటూ ఇటూగా 52 కిలోలు మాత్రమేనట. ఇప్పుడు సమంత వెయిట్ లిఫ్టింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తన కంటే 20 కిలోలు ఎక్కువ బరువును ఎత్తడంతో ఆశ్చర్యపోవడం వీక్షకుల వంతైంది. హీరోయిన్లు అంటేనే సున్నితత్వానికి మారుపేరన్నట్టు వ్యవహరిస్తుంటారు. కష్టపడే పనులకు దూరంగా జరుగుతారు.
 
  మరి, సమంతకు ఎందుకీ వెయిట్ లిఫ్టింగ్‌లు, వగైరా అంటే.. ఓ రకమైన ఫిట్‌నెస్ ప్రొగ్రామ్ ఇది. ప్రస్తుతం ఫిట్‌నెస్ కాపాడుకోవడానికి సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ పవర్ ట్రైనింగ్‌ను ఆశ్రయిస్తున్నారు. అందులో ఈ వెయిట్ లిఫ్టింగ్ కూడా ఓ వ్యాయమం. ఐ లైక్ జిమ్.. లవ్ వెయిట్స్ అని కొత్త స్టేట్మెంట్ ఇచ్చారు సమంత. నాగచైతన్య, మస్కతి ఐస్‌క్రీమ్, వర్క్ - ఈ మూడూ లేకుండా జీవించలేనని ఆ మధ్య సమంత చెప్పారు. ఆ లిస్ట్‌లో ఇక వెయిట్ లిఫ్టింగూ చేరుతుందేమో!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement