జిమ్‌కి డుమ్మా కొడితే దెబ్బలు పడతాయ్! | Will try not to work with Bipasha Basu again: Vashu Bhagnani | Sakshi
Sakshi News home page

జిమ్‌కి డుమ్మా కొడితే దెబ్బలు పడతాయ్!

Published Sun, Jun 22 2014 11:58 PM | Last Updated on Sat, Sep 2 2017 9:13 AM

జిమ్‌కి డుమ్మా కొడితే దెబ్బలు పడతాయ్!

జిమ్‌కి డుమ్మా కొడితే దెబ్బలు పడతాయ్!

‘‘భవిష్యత్తు కోసం మనం డబ్బులు వెనకేసుకోవాలనుకుంటాం. దానికోసం పరుగులుపెట్టి సంపాదిస్తాం. కానీ, ఆరోగ్యంగా లేకపోతే ఏం లాభం’’ అని బిపాసా బసు అంటున్నారు.

‘‘భవిష్యత్తు కోసం మనం డబ్బులు వెనకేసుకోవాలనుకుంటాం. దానికోసం పరుగులుపెట్టి సంపాదిస్తాం. కానీ, ఆరోగ్యంగా లేకపోతే ఏం లాభం’’ అని బిపాసా బసు అంటున్నారు. ఫిట్‌నెస్‌కి ప్రాధాన్యం ఇచ్చే బిపాసా దానికి సంబంధించిన డీవీడీలు కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎన్ని డబ్బులున్నా ఆరోగ్యం లేకపోతే జీవితాన్ని ఆస్వాదించలేం అంటున్నారు ఈ బ్యూటీ. అందుకే, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండని సూచిస్తున్నారు. తన దగ్గర కేశాలంకార నిపుణురాలిగా చేస్తున్న అమ్మాయి చాలా బరువుగా ఉంటుందట. ఏవో సలహాలిచ్చి, తను సన్నబడేలా చేశారు బిపాసా.
 
 బరువు తగ్గిన తర్వాత మునుపటికన్నా ఆరోగ్యంగా ఉండగలుగుతున్నానని ఆ హెయిర్ స్టయిలిస్ట్ అంటున్నారు. ఇక, ఇంట్లో వాళ్లకి బిపాసా ఇచ్చే సలహాలు అన్నీ ఇన్నీ కావట. ప్రతిరోజూ తన తల్లితో జాగింగ్ చేయిస్తుంటానని పేర్కొన్నారామె. ఇక, తన సోదరినైతే రోజూ జిమ్‌కెళ్లమంటారట. ఎప్పుడైనా జిమ్‌కి డుమ్మా కొడితే దెబ్బలు పడతాయ్ అని బెదిరిస్తుంటారట. ఒక్కరోజు వ్యాయామం చేయకపోతే ఆరోగ్యపరంగా వెనకబడ్టట్లే అంటున్నారు ఈ బెంగాలీ బ్యూటీ. మనం ఇప్పుడు చేసే వ్యాయామం ఆరోగ్యపరంగా మన భవిష్యత్తుకి మంచి పెట్టుబడివంటిదని బిపాసా చెబుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement