కావలసినవి:
►మటన్ – కిలో; పాలు– కప్పు; కుంకుమ పువ్వు– చిటికెడు; నెయ్యి– అర కప్పు; ఇంగువ – అర టీ స్పూన్; జీలకర్ర– టీ స్పూన్;
►దాల్చిన చెక్క – 2 అంగుళాల ముక్క; నల్ల యాలకులు – 5; మిరియాలు – టీ స్పూన్;
►ఎండుమిర్చి– 4; పెరుగు– 150 గ్రా; గోధుమపిండి– టేబుల్ స్పూన్; శొంఠిపొడి – 2 టీ స్పూన్‌లు;
►ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి; ధనియాల పొడి– టేబుల్ స్పూన్;
►కశ్మీరీ మిరపపొడి– టేబుల్ స్పూన్; సోంపు పొడి– టేబుల్ స్పూన్; కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూన్.
తయారీ:
►మటన్‌ను శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి.
►పాలను వేడి చేసి అందులో కుంకుమ పువ్వు వేసి పక్కన ఉంచాలి.
►ప్రెషర్ పాన్‌లో నెయ్యి వేడి చేసి దాల్చిన చెక్క, యాలకులు, మిరియాలు, ఇంగువ, జీలకర్ర, ఎండుమిర్చి వేసి సన్న మంట మీద వేయించాలి. అవి వేగిన తరవాత అందులో మటన్ వేసి కలిపి మూత పెట్టి మీడియం మంట మీద ఐదారు నిమిషాల సేపు ఉంచాలి. ఇప్పుడు మూత తీసి అరకప్పు నీటిని పోసి మూత పెట్టి పది– పదిహేను నిమిషాల సేపు ఉడికించాలి.
►మరొక పాత్రలో పెరుగు, గోధుమ పిండి కలిపి అందులో కుంకుమ పువ్వు కలిపిన పాలు, ఉప్పు, సోంపు పొడి, ధనియాల పొడి, కశ్మీరీ మిరప్పొడి, శొంఠిపొడి కలిపి ఈ మొత్తం మిశ్రమాన్ని మటన్ మిశ్రమంలో కలిపి చిక్కదనం చూసుకుని అవసరమైతే మరికొంత నీటిని కలిపి, ప్రెషర్ పాన్ మూత పెట్టి ఐదారు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
►వేడి, ప్రెషర్ తగ్గిన మూత తీసిన కొత్తిమీర తరుగు చల్లి వెంటనే మూత పెట్టాలి. ఈ మటన్ రోగన్ జోష్ చపాతీ, పుల్కాలతోపాటు అన్నంలోకి కూడా బాగుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment