
ఆవకాయలోని నూనెలో నానిన వెల్లుల్లి రుచిని ఇష్టపడని వారు చాలా తక్కువ. వెల్లుల్లి ఘాటు అనేక ఆరోగ్యప్రయోజనాలు ఇస్తుంది.
♦ వెల్లుల్లి జీర్ణక్రియ బాగా జరిగేలా తోడ్పడుతుంది. జీర్ణవ్యవస్థలో వాపు, మంటలను ఉపశమింపజేస్తుంది
♦ వెల్లుల్లిలోని ఘాటుదనం వల్ల అనేక క్యాన్సర్లను స్వాభావికంగా నివారించవచ్చు. పెద్దపేగు (కోలన్), పొట్ట, ఈసోఫేజియల్ క్యాన్సర్లతో పాటు రొమ్ము క్యాన్సర్ గడ్డలను వెల్లుల్లి తేలిగ్గా నివారిస్తుంది
♦ వెల్లుల్లిలోని అల్లిసిన్ అనే కాంపౌండ్ చెడు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచడంతో పాటు దాని దుష్ప్రభావాలను నివారిస్తుంది
♦ వెల్లుల్లిలోని అల్లిసిన్‌లో రక్తనాళాలను విప్పార్చేలా చేసే గుణం ఉండటం వల్ల అధిక రక్తపోటు తగ్గుతుంది ∙వెల్లుల్లిలోని ఔషధగుణాలు డయాబెటిస్‌ను నియంత్రణలో ఉండేలా చేస్తాయి ∙వెల్లుల్లి జలుబు, దగ్గును దూరం చేస్తుంది. రెండు వెల్లుల్లి రెబ్బలను కాస్తంత నలిపి తింటే జలుబు తీవ్రత చాలావరకు తగ్గుతుంది
♦ వెల్లుల్లిలోని సెలినియమ్, క్వార్సెటిన్, విటమిన్–సి పుష్కలంగా ఉండటం వల్ల అది గాయాలను సమర్థంగా మాన్పగలదు. అంతేకాదు... కంటికి వచ్చే ఇన్ఫెక్షన్లు, కళ్లవాపును తగ్గిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment