
►అరలీటరు నీటిని వేడి చేసి అందులో మూడు నుంచి ఐదు చుక్కల అరోమా ఆయిల్ వేసి గదిలో ఒక మూలగా ఉంచితే మెల్లగా గదంతా సువాసనభరితమవుతుంది. ఆ గాలినే పీల్చడం వల్ల శ్వాసకోశ రుగ్మతలు నివారణ అవుతాయి. రోజంతా మనసు ఆహ్లాదంగా ఉంటుంది. నీటిని పోసిన పాత్ర మీద సన్నని చిల్లులున్న మూత కాని, వదులుగా ఉన్నది కాని పెడితే నీటి ఆవిరితో ఎసెన్షియల్ ఆయిల్ సువాసన కొద్దికొద్దిగా రోజంతా విడుదలవుతుంది.
►పూరీల్లాంటివి వేయించినప్పుడు మూకుడు అడుగున నల్లగా పేరుకుంటుంది. అలాంటప్పుడు ఆ మూకుడులో ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసి, పొయ్యిమీద పెట్టాలి. కాసేపటికి పేరుకున్న నల్లని మిశ్రమం రెబ్బలకు అంటుకుంటుంది. వాటిని తీసేసి నూనెను వడకట్టాలి.