మధ్యప్రదేశ్‌లోని రియావాన్ గ్రామానికి చెందిన వెల్లుల్లికి జియోగ్రాఫికల్ ఇండికేషన్(జీఐ) ట్యాగ్ లభించింది. రియాన్ వెల్లులి జీఐ నమోదు కోసం చెన్నైలోని రైతు ఉత్పత్తుల సంస్థ(ఎఫ్‌పీఓ) రియావాన్ ఫార్మ్ ఫ్రెష్ ప్రొడ్యూసర్ కంపెనీ జనవరి 2022 నుంచి ప్రారంభించింది. ఉద్యానవన శాఖ, మధ్యప్రదేశ్ ప్రభుత్వం జిల్లా పరిపాలన సహకారంతో మార్చి 2న రియాన్ వెల్లుల్లి ఈ జిఐ ట్యాగ్‌ని పొందింది. ఆ రాష్ట్ర ఎమ్మెల్యే పాండే, వ్యవసాయమంత్రి, ముఖ్యమంత్రి అభ్యర్థనలు అసెంబ్లీలో ఆమోదం పొందడంతో ఆ వెల్లుల్లి ఈ ప్రతిష్టాత్మక ట్యాగ్‌ని పొందగలిగింది.
ఈ వెల్లుల్లి ప్రత్యేకత..
- ఈ వెల్లుల్లి ప్రతి రెమ్మ లవంగంతో సరిపడ ఘాటు ఉంటుంది. దీనిలో అధిక నూనె ఉంటుంది.
- ఈ వెల్లుల్లిని రియావాన్ సిల్వర్ గార్లిక్ అని కూడా పిలుస్తారు. దేశంలోనే అత్యధిక డిమాండ్ కలిగిన వెల్లుల్లి ఇది.
- దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.
- ఇది ఇతర వెల్లుల్లిపాయల కంటే మంచి సువాసనతో కూడిన ఘాటు ఉంటుంది.
- చాలా రోజులు నిల్వ ఉంటుంది.
- ఇక్కడ గ్రామస్తులు దశాబ్దాలుగా ఈ వెల్లుల్లిని సంప్రదాయ పద్ధతిలో సాగు చేస్తుండటం విశేషం.
- పొరగు ప్రాంతా వారు ఇక్కడ రైతుల నుంచి రియావాన్ వెల్లుల్లి విత్తనాలను పట్టుకెళ్తుంటారు.
- నాణ్యతకు, అధిక దిగుబడికి పెట్టింది పేరు ఈ వెల్లుల్లి
Comments
Please login to add a commentAdd a comment