సాధారణంగా ప్రతి ఒక్కరిని వేధించే సమస్య పేల బాధ. ఇంట్లో అందుబాటులో ఉన్న పదార్ధాలతోనే వాటి నుంచి విముక్తి పొందే చిట్కాలు మీకోసం.
- పేల నివారణకు వెల్లుల్లి అద్భుతంగా పని చేస్తుంది. ముందుగా కొన్ని వెల్లుల్లి రెబ్బలను మెత్తగా నూరి, దానికి కాస్త నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించి మునివేళ్లతో చిన్నగా మర్ధన చేయాలి. గంటసేపు అలాగే ఉంచాలి. ఆ తరువాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయించి.. చిక్కుదువ్వెనతో దువ్వాలి. అప్పుడు పేలు మొత్తం రాలిపోతాయి.
- వేపాకు మెత్తగా నూరి.. అందులోకి రెండుచుక్కలు ఆలివ్ ఆయిల్ కలిపి.. జుట్టు కుదుళ్లకు పట్టించాలి. గంట తరువాత స్నానం చేయాలి.
- తెల్ల ఉల్లిగడ్డలు కూడా పేలను తగ్గించేవే. ఈ ఉల్లితో రసం తీసి తలకు పట్టించాలి. గంట తరవాత స్నానం చేయాలి. రోజు మార్చి రోజు పది రోజుల పాటు చేస్తే పేలు తగ్గుతాయి.
- బాదం పప్పులను ఒకరోజు మొత్తం నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే వాటిపైనున్న తొక్కను తీసేసి.. మెత్తటి పేస్టులా రుబ్బుకోవాలి. అందులోకి రెండుమూడు స్పూన్ల నిమ్మరసం కలిపి. జుట్టు కుదుళ్లకు పట్టించాలి.
- వేపగింజల నూనె మార్కెట్లో దొరుకుతుంది. దాన్ని తీసుకుని తలకు పట్టించవచ్చు. లేదంటే వేపనూనెకు షాంపూను కలిపి కూడా జుట్టుకు అప్లై చేయవచ్చు.
- ఆపిల్ సిడార్ వెనిగర్‌ను తలకు పూసుకుంటే పేలను తొలగించడమే కాకుండా.. జుట్టు కుదుళ్లకు అవసరమైన శక్తిని కూడా అందిస్తుంది.
- గోరువెచ్చని కొబ్బరినూనె, బాదం నూనెలను తలకు పట్టించి, పొద్దున్నే తలస్నానం చేసి, దువ్వెనతో దువ్వాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తుండడం వల్ల తలలో పేలు చేరకుండా ఉండడమే కాకుండా, జుట్టుకు మెరుపు వస్తుంది. జుట్టు కుదుళ్లు బలంగా ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment