బ్యూటిప్స్
కొందరి అరచేతులు, కాళ్లు గరకుగా, జీవం లేనట్టుగా ఉంటాయి. అలాంటప్పుడు ఈ చిట్కాను వాడి చూడండి. ఒక టబ్‌లో సగం వరకు వేడి నీళ్లు పోసి, అందులో రెండు టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్ (మొక్కజొన్న పిండి) వేసి కలపాలి. అందులో చేతులను, కాళ్లను 10-15 నిమిషాలపాటు నానబెట్టాలి. తర్వాత వాటిని గోరువెచ్చని మంచి నీళ్లతో శుభ్రం చేసుకొని కొబ్బరినూనె రాసుకోవాలి. ఇలా రోజూ రాత్రి పడుకునేముందు చేస్తే రెండు వారాల్లో ఫలితం కచ్చితంగా కనిపిస్తుంది.
ఎలాంటి వాతావరణంలోనైనా చర్మానికి బాడీ లోషన్ చాలా ముఖ్యం. మార్కెట్‌లో దొరికే లోషన్లు వాడటం కన్నా ఇంట్లోనే తయారు చేసుకుంటే ఆరోగ్యకరం. తయారు చేసుకునేందుకు నిమ్మకాయలు, గ్లిజరిన్, రోజ్‌వాటర్ ఉంటే చాలు. టేబుల్ స్పూన్ నిమ్మరసంలో టేబుల్ స్పూన్ రోజ్‌వాటర్, టేబుల్ స్పూన్ గ్లిజరిన్ వేసి బాగా కలపాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని ఓ గాజు సీసాలో ఫ్రిజ్‌లో పెట్టుకుంటే సరి. రోజూ స్నానానికి అరగంట ముందు లేదా రాత్రి పడుకునేటప్పుడు రాసుకుంటే సరి. చర్మం మృదువుగా ఆరోగ్యవంతంగా ఉంటుంది.