![beauty tips - Sakshi](/styles/webp/s3/article_images/2018/02/22/5348800-2508x1672%5B1%5D.jpg.webp?itok=m4SZ6tjL)
స్నానం శరీరాన్ని ఆరోగ్యంగా, చురుగ్గా, మనసుని ఉల్లాసంగా ఉంచుతుంది. మెదడుని ఉత్తేజపరుస్తుంది. అలసిన దేహం తిరిగి తాజాదనం పొందుతుంది.
∙ ఉదయం వేళ రెండు స్పూన్ల నిమ్మరసాన్ని బకెట్ నీటిలో కలిపి స్నానం చేస్తే వేసవిలో బాధించే చెమట వాసన రాదు.
∙పొడిచర్మం వున్నవాళ్లు బకెట్ నీటిలో అర టీ స్పూన్ కొబ్బరినూనె లేదా బాదంనూనె కలిపి స్నానం చేస్తే చర్మం మృదువుగా అవుతుంది.
∙ రోజంతా తాజాగా అనిపించాలంటే నీటిలో అరకప్పు రోజ్‌వాటర్ కలుపుకొని స్నానం చే యాలి. రోజూ సాయంకాలం గోరువెచ్చని నీటిలో గుప్పెడు గులాబీ రేకుల్ని వేసి స్నానం చేస్తే బడలిక తీరుతుంది. చర్మానికి మంచి రంగు వస్తుంది.
∙చిన్న అల్లం ముక్క వేసి ఉడకబెట్టిన నీటిని కలుపుకొని స్నానం చేస్తే కీళ్ళనొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.స్నానం చేసిన తరువాత తడి ఒంటికి మాయిశ్చరైజర్‌ని రాసుకుంటే చర్మం మృదుత్వాన్ని కోల్పోదు. స్నానానికి ముందు శరీరానికి, ముఖానికి నూనెతో మర్దన చేయడం వల్ల కండరాలు ఉత్తేజితమవుతాయి. చర్మం మృదువుగా తయారవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment