తులసి ఫేస్ ప్యాక్
బ్యూటిప్స్
తులసి ఆకులు – కొన్ని, ఓట్స్ పొడి – రెండు టీ స్పూన్లు, పాల పొడి – రెండు టీ స్పూన్లు తులసి ఆకులు మిక్సీలో వేసి పేస్ట్ చేయాలి. దీంట్లో ఓట్‌మీల్ పొడి, పాల పొడి వేసి కొద్దిగా నీటిని చేర్చి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి ఆరిన తరవాత కడిగేయాలి.
కాఫీ పౌడర్ మాస్క్
జిడ్డు చర్మం పెట్టే కష్టాలు భరించలేకపోతున్నారా? అయితే ఈ చిట్కా మీ కోసమే. కాఫీ పొడి, పాల పొడి మీ సమస్యను ఇట్టే దూరం చేస్తాయి. పాల పొడి, కాఫీ పొడి రెండింటిని సమపాళ్లల్లో తీసుకోవాలి. వీటిని రోజ్ వాటర్‌తో కలిపి మెత్తని పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని ముఖానికి అప్లై చేసుకుని పదిహేను నిమిషాల పాటు ఉంచుకోవాలి. తర్వాత నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ మాస్క్ ముఖంపై ఉన్న మలినాలు, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్‌ని తొలగిస్తుంది. చర్మం ఆయిలీ అయిపోకుండా ఎక్కువసేపు తాజాగా ఉంటుంది.