ముడతలు తగ్గాలంటే... | how to less then to wrinkle ... | Sakshi

ముడతలు తగ్గాలంటే...

Mar 27 2016 10:33 PM | Updated on Sep 3 2017 8:41 PM

ముడతలు తగ్గాలంటే...

ముడతలు తగ్గాలంటే...

గుడ్డులోని తెల్లసొన, అర టీ స్పూన్ మీగడ, అర టీ స్పూన్ నిమ్మరసం కలపాలి

 బ్యూటిప్స్

గుడ్డులోని తెల్లసొన, అర టీ స్పూన్ మీగడ, అర టీ స్పూన్ నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. రోజు విడిచి రోజు ఈ ప్యాక్ వేసుకుంటూ ఉంటే చర్మం ముడతలు పడటం తగ్గుతుంది.  అంగుళం పరిమాణంలో క్యారెట్ ముక్క, సగం బంగాళదుంప ముక్క కలిపి ఉడకబెట్టి, గుజ్జులా చేయాలి. దీంట్లో చిటికెడు పసుపు, బేకింగ్ సోడా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, కాసేపటి తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ముడతలు తగ్గడమే కాకుండా చర్మం మృదువుగా మారుతుంది.

 
రెండు టీ స్పూన్ల రోజ్ వాటర్, ఒక చుక్క గ్లిజరిన్, 2 చుక్కల నిమ్మరసం కలపాలి. దూది ఉండతో ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాయాలి. ఇది ఇంట్లో చర్మానికి మంచి మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. చర్మం ముడతలు పడదు. యవ్వనకాంతితో మెరుస్తుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement