కొన్ని ద్రాక్ష పండ్లను సగానికి కట్ చేసి, ఆ సగం ముక్కలతో ఒక దాని తర్వాత ఒకటిని ఉపయోగిస్తూ ముఖంపైన మృదువుగా రుద్దాలి. ద్రాక్షలోని ఔషధ గుణాల వల్ల మృతకణాలు సులువుగా వదిలిపోతాయి. ఎండ వల్ల కందిన చర్మం పూర్వపు స్థితికి చేరుకుంటుంది ∙టేబుల్ స్పూన్ ముడి తేనెను కొద్దిగా వేడిచేయాలి. తట్టుకోగలిగేంత వేడిగా ఉన్నప్పుడు వేళ్లతో ఆ తేనెను తీసుకొని ముఖమంతా రాయాలి. 5–10 నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి ∙టేబుల్‌స్పూన్ తేనె, రెండు టేబుల్ స్పూన్‌ల మీగడ కలిపి ముఖానికి పట్టించి, పది నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి.
రోజూ ఇలా చేస్తూ ఉంటే చర్మకాంతి ఇనుమడిస్తుంది ∙పిగ్మెంటేషన్ వల్ల అయిన నలుపు మచ్చలు పోవాలంటే బంగాళదంపను సగానికి కోసి, ఆ ముక్కతో మృదువుగా రుద్దాలి. రోజూ ఇలా చేస్తూ ఉంటే నలుపు తగ్గుతుంది ∙దోస రసం, గ్లిజరిన్, రోజ్ వాటర్ కలిపి ఫ్రిజ్‌లో ఉంచాలి. చల్లబడిన తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇది ఎండ వేడి నుంచి ఉపశమిస్తుంది. సన్‌స్క్రీన్‌లోషన్‌లా పనిచేస్తుంది.
తాజాగా తేజస్సుతో..
Published Wed, Mar 7 2018 12:14 AM | Last Updated on Wed, Mar 7 2018 12:14 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment