కురులకు సౌందర్య సిరులు
బ్యూటిప్స్
జుత్తు చిక్కులు పడి ఇబ్బంది పెడుతుంటే... అరటిపండును మెత్తని పేస్ట్‌లా చేసి, అందులో కాసిన్ని పాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని జుత్తు కుదుళ్ల నుంచి చివర్ల వరకూ పట్టించి, అప్పుడు దువ్వెనతో దువ్వితే చిక్కులు విడిపోతాయి.కొబ్బరి పాలలో కొంచెం రోజ్ వాటర్, నిమ్మరసం కలిపి కుదుళ్లకు పట్టించి, అరగంట తర్వాత తలంటుకోవాలి. తరచూ ఇలా చేస్తే జుత్తు ఆరోగ్యంగా పెరుగుతుంది.
తాజా అల్లాన్ని దంచి, రసం తీయాలి. దీనిలో తేనె, కోడిగుడ్డు తెల్ల సొన కలిపి మాడుకు పట్టించి, గంట తర్వాత తలంటుకోవాలి. వారానికోసారి ఇలా చేస్తే చుండ్రు సమస్య వదిలిపోతుంది. పచ్చిపాలలో శెనగపిండి, నిమ్మరసం కలిపి జుత్తుకు ప్యాక్ వేసి, ఆరిన తర్వాత షీకాయ పొడితో తలంటుకోవాలి. ఇలా చేస్తే పొడిబారిన చర్మం తేమగా తయారై నిగనిగలాడుతుంది.