
చర్మం నిగారింపు కోసం...
బ్యూటిప్స్
క్యారట్, సగం బీట్‌రూట్ ముక్క, చిన్న టొమాటో అన్నింటినీ ముక్కలుగా కట్ చేసి గ్రైండ్ చేయాలి. దీంట్లో పెరుగు కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసి ఆరిన తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. టీ స్పూన్ గడ్డ పెరుగులో పావు టీ స్పూన్ పసుపు కలిపి ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల తరవాత కడిగేయాలి.అర టీ స్పూన్ మెంతులు టేబుల్ స్పూన్ పాలలో వేసి పది నిమిషాలు నానబెట్టి, పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.
మూడు నాలుగు జీడిపప్పులను పొడి చేయాలి. ఈ పొడిలో పచ్చిపాలను కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తరవాత కడిగేయాలి. అర టీ స్పూన్ ఆవాల నూనెలో కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమన్ని వేళ్లతో కొద్దికొద్దిగా తీసుకుని వలయాకారంలో 10 నిమిషాల పాటు మసాజ్ చేసి, గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఈ విధంగా వారంలో ఒకసారి చేస్తే చర్మం నిగారిస్తుంది.
నాలుగు బాదం పలుకులను పొడి చేయాలి. దీంట్లో టీ స్పూన్ రోజ్ వాటర్, టీ స్పూన్ పచ్చిపాలు కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి వేళ్లతో వలయాకారంలో పది నిమిషాల పాటు మర్దనా చేసి, అయిదు నిమిషాల తరవాత గోరువెచ్చని నీటితో కడిగేసి, పొడిగా తుడిచిన తరవాత మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. ఈ విధంగా వారంలో ఒకసారి చేయడం వలన చర్మం నునుపవుతుంది