Anushka Sharma Reveals About Her Beauty Secret, See Inside Details - Sakshi
Sakshi News home page

Anushka Sharma Beauty Secret: టీనేజ్‌లో ఉన్నపుడు అమ్మ చెప్పింది.. నా బ్యూటీ సీక్రెట్‌ అదే!

Aug 9 2022 2:25 PM | Updated on Aug 9 2022 3:59 PM

Beauty Tips: Anushka Sharma Reveals About Her Beauty Secret - Sakshi

అందం, అభినయంతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది బాలీవుడ్‌ బ్యూటీ అనుష్క శర్మ. బాలీవుడ్‌ బాద్‌ షా షారుఖ్‌ ఖాన్‌ రబ్‌ నే బనాదీ జోడీ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అనుష్క.. బీ-టౌన్‌ అగ్ర హీరోయిన్‌గా ఎదిగింది. అంతేకాదు తన సోదరుడు కర్ణేశ్‌ శర్మతో కలిసి పలు హిట్‌ సినిమాలు నిర్మించింది కూడా! ఇక 2017లో టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లిని పెళ్లాడింది ఈ అయోధ్య అందం.

ఈ క్రమంలో గతేడాది పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది అనుష్క శర్మ. కాగా ఎంతటి బిజీ షెడ్యూల్‌లోనైనా ఫిట్‌నెస్‌కు సమయం కేటాయించే ఆమె.. ముఖ సౌందర్యాన్ని కాపాడుకోవడానికీ అంతే ప్రాధాన్యతనిస్తుంది. అయితే, నిగనిగలాడే చర్మం కోసం కృత్రిమ పద్ధతుల బదులు ఇప్పటికీ తన తల్లి చెప్పిన చిట్కానే ఫాలో అవుతానంటోంది ఈ అందాల రాశి. 

అమ్మ చెప్పింది!
అనుష్క శర్మ సౌందర్య రహస్యం ఆమె మాటల్లోనే.. ‘‘నిగనిగలాడే చర్మం కోసం సదా నేను పాటించే చిట్కా ఒక్కటే... ఫేస్‌ ప్యాక్‌. కొంచెం పెరుగు, రోజ్‌ వాటర్‌లో కాసింత వేపాకు పొడి వేసి బాగా కలిపి మొహానికి, మెడకు అప్లయ్‌ చేస్తాను. అది ఆరిపోయాక చన్నీళ్లతో మొహం కడిగేసుకుంటాను. ఎంత తరచుగా వీలైతే అంత తరచుగా ఈ చిట్కాను పాటిస్తా. 

నేను టీన్స్‌లో ఉన్నప్పుడు పింపుల్స్‌ వస్తుంటే మా అమ్మ చెప్పింది ఈ కిటుకు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా మొహమ్మీద చిన్న మచ్చ కూడా లేకుండా.. రాకుండా కాపాడుతోంది ఈ ఫేస్‌ ప్యాక్‌’’.  కాగా అనుష్క శర్మ ప్రస్తుతం.. భారత మహిళా క్రికెటర్‌ ఝులన్‌ గోస్వామి బయోపిక్‌ చక్దా ఎక్స్‌ప్రెస్‌ సినిమాతో బిజీగా ఉంది. ఇక వీలు చిక్కినప్పుడల్లా భర్త విరాట్‌ కోహ్లి, కూతురు వామికతో అనుష్క సరదాగా సమయం గడుపుతుంది. ఈ అప్‌డేట్లను ఎప్పటికప్పుడు తన సోషల్‌ మీడియాలో అకౌంట్లలో షేర్‌ చేస్తూ ఉంటుంది.


చదవండి: Shilpa Shetty: పొరపాటున కూడా మొహానికి సబ్బు వాడను.. నా బ్యూటీ సీక్రెట్‌ అదే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement