పండ్లు తింటేనే కాదు గుజ్జు లేదా జ్యూస్ చేసుకుని.. ముఖానికి అప్లై చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు. మచ్చలు తొలగిపోయి.. మొటిమలు తగ్గిపోయి.. ముఖం తేజోవంతంగా మారాలంటే మీరు కూడా ఇలా ప్రయత్నించండి.
కావల్సినవి: క్లీనప్ : ఆపిల్ జ్యూస్ – 2 టీ స్పూన్లు
స్క్రబ్ : దానిమ్మ గుజ్జు – 3 టీ స్పూన్
నిమ్మరసం – పావు టీ స్పూన్
మాస్క్: బొప్పాయి గుజ్జు –4 టీ స్పూన్లు
ఆరెంజ్ జ్యూస్ – 1 టీ స్పూన్
తయారీ: ముందుగా ఆపిల్ జ్యూస్‌తో క్లీనప్ చేసుకోవాలి. తర్వాత దానిమ్మ గుజ్జు, నిమ్మరసం ఒక బౌల్‌లోకి తీసుకుని బాగా కలుపుకుని ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. ఇప్పుడు చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. తర్వాత బొప్పాయి గుజ్జు, ఆరెంజ్ జ్యూస్ కలిపి.. ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇరవై లేదా ఇరవై ఐదు నిమిషాల పాటు ఆరనిచ్చి.. తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment