సౌందర్య సంరక్షణలో సహజ వైద్యాన్ని కోరుకుంటారు చాలామంది. అందులో ముఖ్యంగా ముఖానికి ఐస్ మసాజ్ అనేది బెస్ట్ ట్రీట్‌మెంట్ అంటారు చాలామంది. అయితే ఐస్ ముక్కను ఎక్కువ సమయం చేత్తో పట్టుకోవడం కష్టం. పైగా త్వరగా కరిగిపోయి, చికాకు కలిగిస్తుంది. అందుకే చాలామంది ఐస్ రోలర్స్ ఉపయోగిస్తూ ఉంటారు. వాటిని ఫ్రిజ్‌లో కొన్ని గంటలు ఉంచి, ఆ తర్వాత వినియోగిస్తూ ఉంటారు. అయితే చిత్రంలోని ఐస్ రోలర్ సులువుగా వాడుకోవడానికి అనువుగా తయారైంది. ఇప్పుడు దాని వివరాలు చూద్దాం.
సౌందర్య నిపుణుడు కెర్రీ బెంజమిన్ ఈ రోలర్‌ను రూపొందించారు. దీన్ని పట్టుకోవడానికి వీలుగా హ్యాండిల్, దానిపైన గుండ్రటి రోలర్ అటాచ్ చేసి ఉంటుంది. దీనిని స్టెయిన్స్ లెస్ స్టీల్‌తో రూపొందించడంతో ఫ్రిజ్‌లో ఉంచి తీశాక ఆ చల్లదనం చాలాసేపు ఉంటుంది. అలాగే ముఖంపై మసాజ్ చేసుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది. దీనితో మసాజ్ చేసుకుంటే కళ్లకింద వాపులు, కళ్ల చుట్టూ నల్లటి వలయాలు, ముఖంపై ముడతలు తగ్గుతాయి.
ఇది వయసు తెలియకుండా కాపాడుతుంది. దీని రోలర్‌కి మాత్రమే సరిపోయేలా సిలికాన్ క్యాప్ అవసరాన్ని బట్టి అమర్చుకోవచ్చు, తీసేసుకోవచ్చు. ఇది ఎర్గానామిక్ హ్యాండిల్‌ని కలిగి ఉండటంతో ఫ్రిజ్‌లో పెట్టినా హ్యాండిల్ చల్లగా కాదు. దాంతో చేత్తో పట్టుకుని వినియోగించుకోవడం తేలిక అవుతుంది.ఈ మసాజర్ ఎర్రగా కందిపోయినట్లుగా మారిన చర్మాన్ని ఇట్టే చక్కగా, మృదువుగా మారుస్తుంది. దురదల వంటి సమస్యలను దూరం చేస్తుంది. దీని ధర 85 డాలర్లు. అంటే 7,138 రూపాయలు.
Comments
Please login to add a commentAdd a comment