
మొటిమలు, మచ్చలు లేని మెరిసే చర్మం కోసం నానా తంటాలు పడుతుంటారు మహిళలు. చర్మం కాస్త రఫ్‌గా అనిపించినా.. చిన్న మొటిమ కనిపించినా అది తగ్గేంత వరకూ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. మంచి ఫేస్‌క్రీమ్స్ కోసం మార్కెట్‌లో వేట మొదలుపెడతారు. అయితే కెమికల్స్‌తో తయారైన ఫేస్‌క్రీమ్స్ కంటే.. ఇంటిపట్టున దొరికే సహజసిద్ధమైన ఫేస్ ప్యాక్సే మంచివంటున్నారు నిపుణులు. దాంతో ముఖంపైన ఉన్న మృతకణాలు తొలగిపోయి.. అందంగా మారుతుందని అంటున్నారు. మరైతే ఇలా ట్రై చెయ్యండి.
కావలసినవి: క్యారెట్ గుజ్జు – 3 టేబుల్ స్పూన్స్, అరటిపండు గుజ్జు – 2 టేబుల్ స్పూన్స్
పెరుగు – అర టేబుల్ స్పూన్, తేనె – పావు టేబుల్ స్పూన్
తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని... క్యారెట్ గుజ్జు, అరటిపండు గుజ్జు మిక్స్ చేసుకోవాలి. తరువాత ఆ మిశ్రమంలో పెరుగు, తేనె కలుపుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. తరువాత ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు బాగా పట్టించి ఓ 20 నిమిషాలు పాటు బాగా ఆరనివ్వాలి. తరువాత గోరువెచ్చని నీళ్లతో మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి 2 లేదా 3 సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి.
∙