![Funday beauty tips - Sakshi](/styles/webp/s3/article_images/2018/10/28/Untitled-9.jpg.webp?itok=oe8ScxWn)
మచ్చలు, మొటిమలు లేని మోముకోసం చాలా ప్రయత్నిస్తుంటారు మగువలు. రకరకాల ఫేస్ క్రీమ్స్, లోషన్స్ వాడేందుకు సిద్ధమవుతుంటారు. అయితే వాటి వల్ల శాశ్వత పరిష్కారం లభించడం కష్టమే. అలాంటి వారి కోసమే ఈ సహజసిద్ధమైన చిట్కాలు. అయితే ఫేస్‌ప్యాక్ వేసుకునే ముందు క్లీనప్ చేసుకుని, స్క్రబ్ చేసుకుని, ఆవిరి పట్టించుకోవడం తప్పనిసరి. కాస్త సమయం పట్టినా ఇవన్నీ చేస్తేనే ఈ కాలుష్యబారినపడిన మీ చర్మం తిరిగి కాంతివంతంగా మెరుస్తుంది. మరింకెందుకు ఆలస్యం ఇలా ప్రయత్నించండి.
కావల్సినవి : క్లీనప్ : పెరుగు మీగడ – పావు టీ స్పూన్, నిమ్మరసం – పావు టీ స్పూన్, యాపిల్ జ్యూస్ – 1 టీ స్పూన్
స్క్రబ్ : చిక్కటిపాలు – 2 టీ స్పూన్లు, క్యారెట్ గుజ్జు – 2 టీ స్పూన్లు, ఓట్స్ – 2 టీ స్పూన్లు
మాస్క్ : కలబంద గుజ్జు –అర టీ స్పూన్, యాపిల్ గుజ్జు – 2 టీ స్పూన్లు, కొబ్బరి పాలు– అర టీ స్పూన్
తయారీ : ముందుగా పెరుగు మీగడ, నిమ్మరసం, యాపిల్ జ్యూస్ ఒక బౌల్‌లో పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు లేదా మూడు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు చిక్కటిపాలు, క్యారెట్ గుజు ్జ, ఓట్స్ ఒక బౌల్‌లోకి తీసుకుని బాగా కలుపుకుని మూడు లేదా ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పాలు, కలబంద గుజ్జు, యాపిల్ గుజ్జు ఒక బౌల్‌లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, పదిహేను నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment