చర్మగ్రంథుల నుంచి స్రవించే సెబమ్, ఇతర నూనెలు చర్మం మీద ఒక చోట గూడుకట్టుకున్నప్పుడు, వాటికి మృతకణాలు తోడైనప్పుడు మొటిమలు, యాక్నే వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇందుకోసం మార్కెట్‌లో దొరికే క్రీమ్‌లకంటే ఇంట్లోనే చేసుకోగలిగిన పరిష్కారాలు మంచి ఫలితాన్నిస్తాయి.
దాల్చినచెక్కతో ఫేస్‌ప్యాక్: ముఖాన్ని క్లెన్సర్‌తో కానీ మామూలు సబ్బుతో కానీ శుభ్రం చేసుకుని తుడిచేయాలి. రెండు టేబుల్ స్పూన్‌ల తేనెలో టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పదిహేను నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఇప్పుడు చన్నీటితో ముఖం కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తుంటే చర్మం మీద మృతకణాలు, నూనెలు, సెబమ్ వంటివి నిలవకుండా ఎప్పటికప్పుడు తొలగిపోతుంటాయి. కాబట్టి కొత్త మొటిమలు రావు. అప్పటికే ఉన్న మొటిమలు, యాక్నే కూడా తగ్గుముఖం పడుతుంది.
గ్రీన్ టీ ప్యాక్: ఒక గ్లాసు నీటిటో గ్రీన్ టీ బ్యాగ్ వేసి నాలుగు నిమిషాల సేపు మరిగించాలి. గ్రీన్‌టీ పూర్తిగా చల్లారిన తర్వాత అందులో కాటన్ బాల్‌ను ముంచి టీని ముఖానికి పట్టించాలి. టీని ముఖానికి కాటన్ బాల్‌తో పట్టించడం కుదరకపోతే స్ప్రే బాటిల్‌లో పోసుకుని ముఖం మీద స్ప్రే చేసుకుని చర్మానికి పట్టేటట్లు వేళ్లతో అద్దాలి. ఆరిన తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. ఇప్పుడు టీ బ్యాగ్‌ను ఓపెన్ చేసి అందులో రెండు చుక్కల తేనె కలిపి ముఖానికి ప్యాక్ వేయాలి. ఈ ప్యాక్ బాగా ఆరిన తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. రోజుకోసారి ఇలా చేస్తుంటే వారంలోనే మొటిమలు, యాక్నే పోయి చర్మం కాంతిమంతమవుతుంది.
(చదవండి: బెస్ట్ శాండ్‌విచ్‌గా ఈ భారతీయద స్ట్రీట్ ఫుడ్‌కి చోటు! ఎన్నో ర్యాంకులో నిలిచిందంటే..)
Comments
Please login to add a commentAdd a comment