మొటిమలుంటే అందమైన చర్మం...
యుక్త వయసు వచ్చిన అమ్మాయిలకు ముఖంపై మొటిమలు రావడం సర్వసాధారణం. అయితే వారు తెగ ఇబ్బంది పడిపోయి రకరకాల క్రీములు, లోషన్లు వాడుతుంటారు. ఇలాంటివి వాడకపోయినా వయసు పెరిగే కొద్ది అందమైన, మృదువైన చర్మం దానంతట అదే వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మొటిమలే లేని యువతుల జన్యు సమాచారాన్ని, మొటిమలు కలిగిన వారితో పోల్చి చూసినపుడు వారి కణాల్లోని టెలిమోర్‌ల పొడవులో తేడా ఉన్నట్లు గుర్తించారు. దీనివల్ల వారి కణాలు ఇతరుల కంటే ఎక్కువసార్లు విభజన చెందుతాయి.
అంటే టెలిమోర్‌ల పొడవు ఎక్కువగా ఉన్నవారు ఎక్కువ కాలం కూడా ఆరోగ్యంగా ఉంటారు. వీరిలో టెలిమరేజ్ అనే ఎంజైమ్ ఎక్కువగా ఉత్పత్తి అయి, టెలిమోర్‌ల పొడవు తగ్గిపోకుండా చూస్తుంటుంది. ఇది టెలిమోర్‌ల పొడవు తగ్గిపోకుండా చూస్తుంటుంది. ఈ ఎంజైమ్ కొందరిలో ఎక్కువగా, మరికొందరిలో తక్కువగా ఉత్పత్తి అవడం వల్ల సమస్యలు వస్తుంటాయన్నమాట.